Florida-mom-meets-toddler-who-received-her-sons-heart

బిడ్డ చనిపోయినా.. గుండె మాత్రం ఆడుతూనే ఉండాలని..

ఫ్లోరిడా: కన్నబిడ్డ దూరమైతే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. ఫ్లోరిడాకు చెందిన అలీషియా(41) అనే మహిళ ఇలాంటి వేదనే పడుతోంది. అలీషియా నాలుగు నెలల తన బిడ్డను భర్తకు అప్పగించి బయటికి వెళ్లగా.. తిరిగి వచ్చేసరికి తన కొడుకు తలపై తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఆసుపత్రిలో డైలేటెడ్ కార్డియోమైయోపతితో బాధపడుతున్న రెండు నెలల పాపకు గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి రాగా.. అలీషియా తన కొడుకు గుండెను ఆ పాపకు దానం చేసింది. తన బిడ్డ చనిపోయినప్పటికీ.. గుండె మాత్రం ఎప్పటికీ ఆడుతూనే ఉండాలని చెప్పి తన కొడుకు గుండెను దానం చేశానని అలీషియా చెప్పింది. అయితే రెండు వారాల కిందట ఈ రెండు కుటుంబాలు ఫ్లోరిడాలోని డిస్నీ ల్యాండ్‌లో ఎదురుపడ్డాయి. అలీషియా చిన్న పాపలోనే తన కొడుకును చూసుకుని పొంగిపోయింది. పాపను చూస్తుంటే తన కొడుకు బతికున్నట్టే అనిపిస్తోందని.. పాప ఎప్పుడూ ఇలానే సంతోషంగా గడపాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పింది.