Florida-man-wins-villa-that-turns-out-to-be-a-tiny-patch-of-land

రూ. కోటి 20 లక్షల విల్లాను రూ. 6 లక్షలకే కొనేశానని సంబరపడ్డాడు.. తీరా అక్కడకు వెళ్లి చూడగా..

ఫ్లోరిడా: అమెరికాలో ఓ వ్యక్తి ఆన్‌లైన్ వేలంలో మోసపోయాడు. 9100 డాలర్ల(రూ. 6 లక్షల 35 వేలు)కే ఇళ్లంటూ ఆన్‌లైన్‌లో విల్లా ఫొటోలను పెట్టి వేలం వేయగా.. కెర్విల్లే హోల్‌నెస్ అనే వ్యక్తి తెలివిలేకుండా వెంటనే కొనేశాడు. కొన్న తరువాతే తెలిసింది తాను నిజానికి కొనింది విల్లా కాదు ఇంటి బయట ఉన్న 1/100 ఫుట్ స్ట్రిప్ భూమిని మాత్రమేనని. రెండు ఇళ్లను వేరుచేస్తూ మధ్యలో ఉన్న ఓ జానడు స్థలాన్ని రూ. 6 లక్షలు పెట్టి కొన్నానా అంటూ తనపై తానే జాలిపడ్డాడు. కెర్విల్లే కొన్న స్థలం విలువ 50 డాలర్లు(రూ. 3500) మాత్రమే ఉంటుందని తెలుసుకుని ఆవేదన చెందాడు. ఆన్‌లైన్‌లో లక్షా 77 వేల డాలర్ల(రూ. కోటి 23 లక్షల 56 వేలు) విలువ చూపించారని, పైగా విల్లా ఫొటోలు కూడా పెట్టడం వల్లే తాను కొన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన డబ్బు వెనక్కు ఇవ్వమన్నా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. కెర్విల్లే కోర్టును సంప్రదిస్తే తగిన న్యాయం జరిగే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు.