Drunk-Uber-passengers-attack-cars

మద్యం సేవించిన ఇద్దరు మహిళల వీరంగం ఇది

లాస్ఎంజిలెస్, యూఎస్ఏ: అతిగా మద్యం సేవించిన ఇద్దరు మహిళలు ఉబర్ క్యాబ్ డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మద్యం సేవించి కారు ఎక్కారు. కారులో వాంతి చేసుకుంటున్న యువతులను డ్రైవర్‌ కిందికి దించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన యువతులు కారుపై దాడి చేశారు. డ్రైవర్‌ను దుర్భాషలాడారు. కారుకు అడ్డుగా నిలబడి చేతులతో కారును కొట్టారు. అటుగా వెళ్తున్న కార్లపై కూడా దాడికి యత్నించారు. అంతటితో ఆగకుండా చెప్పులతో కారుపై దాడి చేశారు. మహిళల వీరంగంతో ఏం చేయాలో తెలియని స్థితిలో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపు చేశారు. ఇద్దరినీ ఇంటికి పంపించారు. ఘటనా స్థలంలోనే ఉన్న కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సోషల్ మీడియా మాధ్యమాలలో వీడియోలను పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.