couple-fined-huge-by-san-francisco

దంపతులకు భారీ జరిమానా.. ఏం చేశారంటే..

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న డార్రెన్, వలెరీ లీ అనే దంపతులకు భారీ జరిమానా పడింది. నగర నిబంధనలకు విరుద్ధంగా 14 అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకున్నారు. అంతేకాకుండా మొత్తం 45 అపార్టుమెంట్లు కలిగివున్న 17 భవనాలను నిర్వహిస్తున్నారు.  ‘ఎయిర్‌బీఎన్‌బీ’ అనే ప్రైవేట్ సంస్థ పేరిట ఆన్‌లైన్ వ్యాపారంతోపాటు హోటల్ బస వంటి వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు దంపతులకు దాదాపు రూ.16 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ సందర్భంగా అధికారులు పలు హెచ్చరికలను జారీ చేశారు.