Central-Florida-is-the-most-dangerous-place-to-walk-in-the-country-study-says

ఎన్నారైలూ ఇది తెలుసా..? అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమిదే..!

ఫ్లోరిడా: అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతం నడవడానికి ఎంతో ప్రమాదకరమని స్మార్ట్ గ్రోత్ అమెరికా చేసిన అధ్యయనంలో తేలింది. సెంట్రల్ ఫ్లోరిడాలో 2008 నుంచి 2017 వరకు 49,340 మంది పాదచారులు చనిపోయారట. సెంట్రల్ ఫ్లోరిడాలో ప్రమాదకరమైన ప్రదేశాలలో నడవడం వలనే సంఖ్య ఇంతలా ఉందని అధ్యయనం తేల్చింది. తొమ్మిదేళ్లలో దాదాపు 50వేల మంది చనిపోయారంటే.. రోజుకు 13 మందికి పైగా జనం కేవలం నడవడం వల్ల చనిపోతున్నారన్నమాట. 

ఎక్కువ ప్రమాదకరమైన ప్రదేశాలు ఇవే..
1. ఆర్లాండో - కిస్సిమ్మే - శాన్‌ఫార్డ్, ఫ్లోరిడా(656 మంది చనిపోయారు)
2. డెల్టోనా - డేటోనా బీచ్ - ఆర్మాండ్ బీచ్, ఫ్లోరిడా(212 మంది దుర్మరణం)
3. పామ్ బే - మెల్‌బోర్న్ - టిటుస్‌విల్లే, ఫ్లోరిడా( 165 మంది చనిపోయారు)
4. నార్త్ పోర్ట్ - సరాసొటా - బ్రాడెంటన్, ఫ్లోరిడా(194 మంది దుర్మరణం)
5. లేక్‌ల్యాండ్ - వింటర్ హ్యావెన్, ఫ్లోరిడా(162 మంది దుర్మరణం)
6. జాక్సన్‌విల్లే, ఫ్లోరిడా(419 మంది చనిపోయారు)
 
పైన చెప్పిన ప్రదేశాలలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు నెలను అమెరికాలో పెడెస్ట్రిన్ సేఫ్టీ నెలగా జరుపుకుంటారు. దీంతో ఈ ముఖ్యమైన ప్రదేశాలలో బుధవారం ఆర్లాండో పోలీసులు, ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ అధికారులు డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. పాదచారులు నడవాల్సిన సమయంలో ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించి వాహనాన్ని నడిపే డ్రైవర్లపై కఠిన శిక్షలు తీసుకోనున్నారు. వారి లైసెన్స్‌లను సైతం రద్దు చేయనున్నారు.