California-man-gets-230-years-in-prison-for-repeated-rapes-of-girlfriends-daughter

అమెరికాలో ఘోరం.. నీచానికి పాల్పడిన అతడికి 230 ఏళ్ల జైలు శిక్ష

కాలిఫోర్నియా: ఓ మహిళను ప్రేమించి, ఆమెతో కలిసి ఉంటూ.. ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన వ్యక్తికి 230 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కాలిపోర్నియా కోర్టు తీర్పునిచ్చింది. డియోన్ ఆస్టిన్ వెల్చ అనే 30 ఏళ్ల వ్యక్తి ఓ మహిళను ప్రేమించాడు. వీరిద్దరూ కలిసి ఓ అపార్ట్‌మెంట్లో సహజీవనం ప్రారంభించారు. వీరితోపాటు ఆ మహిళ కుమార్తె కూడా ఆ ఇంట్లోనే నివసిస్తోంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అర్థరాత్రి సమయంలో ఆస్టిన్ ఆ అమ్మాయి గదిలోకి వెళ్లడం మొదలెట్టాడు. ఆమె శరీరంపై చేతులువేయడం, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తల్లికి ఆ అమ్మాయి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఈ అకృత్యాలను దాదాపు రెండేళ్లపాటు కొనసాగించాడు. దాంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. కుమార్తెకు అబార్షన్ చేయించడానికి ఆ తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్టిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆస్టిన్ తనపై రెండేళ్లలో కనీసం 90సార్లు అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి చెప్పడంతో కోర్టులోని వారంతా అవాక్కయ్యారు. విచారణలో ఆస్టిన్ నేరం రుజువవ్వడంతో అతనికి 230 ఏళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.