California-Bill-Imposes-Ban-On-Little-Shampoo-Bottles-From-Hotels

ప్లాస్టిక్‌ను అరికట్టడానికి కొత్త బిల్లును ప్రవేశపెట్టిన కాలిఫోర్నియా ప్రభుత్వం

కాలిఫోర్నియా: ప్లాస్టిక్ వాడకం కారణంగా పర్యావరణానికి ఎంతో నష్టం తలెత్తుతోంది. ప్రతి ఏడాది రీసైకిల్ కాని ప్లాస్టిక్ వల్ల వందలాది మూగ జీవులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వల్ల ఎక్కువగా సముద్రజీవులు బలవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడానికి కాలిఫోర్నియా చట్టసభ సభ్యులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై  హోటళ్లలో, లాడ్జిలలో పర్యాటకులు నివసించే ఇతర ప్రదేశాలలో ప్లాస్టిక్ వాడటం నిషేధమంటూ ఓ చట్టాన్ని రూపొందించారు. ముఖ్యంగా హోటళ్లలోని బాత్‌రూంలలో ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని.. ఈ చట్టం ద్వారా దాన్ని అరికట్టచ్చని న్యాయనిపుణులు ఆలోచిస్తున్నారు. టాయిలేటరీ ఉత్పత్తులలో ప్లాస్టిక్ బదులుగా పెద్ద పెద్ద డిసె‌పెన్సర్లను ఉపయోగించాలని ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. స్ట్రాలు, ప్లాస్టిక్ సంచిలు.. ఇతర వస్తువులను వాడకూడదని ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వస్తువుల కారణాంగానే పర్యవరణం ఎక్కువగా దెబ్బతింటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బిల్లు చట్టంగా మారితే పర్యవరణాన్ని కాపాడవచ్చని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా రూపొందించిన ఈ చట్టాన్నే ఇతర రాష్ట్రాలు కూడా రూపొందించే పనిలో ఉన్నాయి.