Boys-stormed-a-girls-bathroom-to-protest-but-it-turns-weird

అమ్మాయిల బాత్రూంలోకి దూరిన యువకుడు.. చివరకు సీన్ రివర్స్..

అలాస్కా: ట్రాన్స్‌జెండర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న కొద్దీ వారి కోసం ప్రత్యేకమైన బిల్లులు, చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కనపడుతోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన కారణంగా ట్రాన్స్‌జెండర్స్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరోసారి ప్రపంచానికి తెలిశాయి. అలాస్కాలోని నార్త్‌పోల్ హైస్కూల్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మగవారి బాత్‌రూంకు వెళ్లింది. అదే బాత్‌రూంలో తాను ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదే స్కూలుకు చెందిన, ట్రాన్స్‌జెండర్‌తో కలిసి చదువుకుంటున్న మగ స్నేహితులు ఈ పోస్ట్‌ను చూసి కోపం తెచ్చుకున్నారు. ట్రాన్స్‌జెండర్ తమ బాత్‌రూంను ఎలా వాడుకుంటుంది అని రెచ్చిపోయి.. తాము కూడా లేడీస్ టాయిలెట‌్‌లోకి వెళ్లి సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్న విధంగానే లేడీస్ టాయిలెట్‌లోకి ఒక విద్యార్థి వెళ్లగా, మిగిలిన వారు టాయిలెట్ ముందు నిరసన చేస్తూ ఉన్నారు. లేడీస్ టాయిలెట్‌లో అప్పటికే ఓ విద్యార్థిని ఉండటంతో అబ్బాయి ఏ కారణంతో లోపలికి వచ్చాడో తెలియక.. మోకాలుతో అతని మర్మంగంపై కొట్టింది. దీంతో బయట ఉన్న విద్యార్థులు నిరసన ఆపేసి.. తమ స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కూలు యాజమాన్యానికి ఈ విషయం తెలియడంతో యువతిని సస్పెండ్ చేశారు. అయితే విద్యార్థినిని సస్పెండ్ చేయడం అన్యాయమంటూ నార్త్ పోల్ స్టేట్ రిప్రజెంటెటివ్ ట్యామీ విల్సన్ ఆరోపించారు. యువతి తనను రక్షించుకోడానికి ఈ పని చేసిందని.. ఆ స్థానంలో తన కూతురు ఉన్నా ఇదే చేసేదని యువతిని కొనియాడారు. అబ్బాయి బాత్‌రూంలో ఎందుకు ఉన్నాడన్నది తనకు అనవసరం అని.. యువతి చేసిన పనిలో మాత్రం ఏ తప్పు లేదంటూ వివరించారు. కాగా, ఈ కేసు విద్యార్థి, విద్యార్థిని నుంచి ట్రాన్స్‌జెండర్స్ హక్కుల వైపు మళ్లింది. ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో.. ప్రతి ఒక్కరు ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రత్యేక బాత్‌రూంలు ఏర్పాటు చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు. ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా ప్రత్యేక హక్కులు ఉండేలా బిల్లును రూపొందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ట్రాన్స్‌జెండర్స్ కోసం అనేక బిల్లులను రూపొందించాయి.