big-alligator-caught-

13 అడుగుల పొడవున్న మొసలిని పట్టుకున్నామని...

కరోలినా: చాలా రోజులుగా ఓ భారీ మొసలి ఆ ప్రాంతంలో సంచరిస్తోందని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అంతటా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఏ మాత్రం ఫలితం లేకుండాపోయింది. మరుసటి రోజు ఓ జర్మన్ షెఫర్డ్ కుక్కను మొసలి తినేసిందని మళ్లీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ సారి మొసలిని ఎలాగైన పట్టుకోవాలని నిర్ణయించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

చివరికి మొసలిని పట్టుకోగలిగారు. ఫ్లోరిడాలోని షామ్ రాక్ పార్క్ సమీపంలో ఆ మొసలిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు. దాదాపు 13 అడుగుల పొడవున్న మొసలిని తాము విజయవంతంగా పట్టుకోగలిగామని వారు సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత అంత భారీ సైజులో ఉన్న మొసలిని పట్టుకున్నట్లు అధికారులు గుర్తు చేశారు.