Batukamma-celebrations-in-Florida

ఫ్లోరిడాలో వైభవంగా బతుకమ్మ, దసరా సంబరాలు..

ఫ్లోరిడా: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో మియామిలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. గత దశాబ్దకాలంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ సంస్థ.. ఈ ఏడు కూడా బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు కమిటీ అధినేత మోహిత్ కర్పూరం సారధ్యం వహించగా, సెక్రటరీ శరత్ కొత్తకాపు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎన్నో పోటీలు, సంగీత, నృత్య విభావరులు నిర్వహించారు. భావితరాలకు బతుకమ్మ ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని పేర్చేవిధానాన్ని, మెళకువలను జాగ్రత్తగా నేర్పించారు. మహిళలకు బతుకమ్మ పోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులందించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా సభ్యులు శ్రవణ్ మొగుడంపల్లి, సునీల్ ఉప్పలి, పవన్ కొమ్మెర, అరుణ గౌరారం, వంశీధర్ కాలం, శ్వేతబాబు, రాజేష్ వంగపల్లి, అమర్ కోలేటి, లక్ష్మణ్ గుడిపాటి, విజయప్రసాద్, పూర్ణచంద్ర కాసా, దేశిక చెరుకు, సునీత తల్లంపల్లి, స్వప్నశ్రీ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.