Batukamma-celebrated-grandly-in-Eerie

పెన్సిల్వేనియాలో బతుకమ్మ సంబరాలు..

పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈరీ ప్రాంతంలో తెలుగువారు తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు పండుగల సందడి ఎక్కువే ఉంటుందని స్థానికులంటున్నారు. ఈ మాటను నిజం చేస్తూ శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు.. బతుకమ్మ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉండే అమెరికన్లను కూడా భాగస్వాములను చేశారు. వారికి కూడా తెలంగాణ సంస్కృతి గొప్పదనం తెలిసేలా బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు. సంబరాల ముగింపులో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.