Baseball-size-hailstones-rain-down-on-Texas

టెక్సాస్‌లో బేస్‌బాల్ సైజు వడగండ్లు.. ఆశ్చర్యపోతున్న అమెరికన్లు

టెక్సాస్: అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో వానలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఎంతలా అంటే అక్కడ పడుతున్న వానలకు బేస్‌బాల్ సైజు వడగండ్లు కూడా పడుతున్నాయట. అంత సైజు వడగండ్లు చూసిన అమెరికన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వడగండ్ల ఫొటోలను పెట్టి ఇంత సైజు వడగండ్లా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడేళ్ల క్రితం కూడా టెక్సాస్‌లో ఇలాంటి విధంగానే వడగండ్లు పడ్డాయని మరికొంతమంది చెబుతున్నారు. శనివారం ఇంట్లో ఉన్న సమయంలో పైకప్పు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని.. ఏంటా అని వెళ్లి చూస్తే లాన్‌లో బేస్‌బాల్ సైజులో ఉన్న వడగండ్లను గమనించినట్టు ఓ అమెరికన్ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి వడగండ్ల కారణంగా.. అనేక చోట్ల భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో బేస్‌బాల్ సైజు వడగండ్లపై కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు.