ATA-Telangana

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్.. ఇక నుంచి ‘ఆటా-తెలంగాణ’..

డెట్రాయిట్: డెట్రాయిట్‌‌లోని షెరటాన్ హోటల్‌లో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్టు మీటింగ్ జరిగింది. ‘ఆటా’ అంటే అమెరికన్ తెలుగు అసోసియేషనా లేక అమెరికన్ తెలంగాణ అసోసియేషనా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుందని అంగీకరించిన బోర్డు సభ్యులు.. ఇక నుంచి తమ అసోసియేషన్‌ను ‘ఆటా-తెలంగాణ’గా పిలవాలని తీర్మానించారు. అయితే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ పేరుకు ఎటువంటి మార్పులూ చేయలేదని, కేవలం దాని షార్ట్ నేమ్‌ మాత్రమే నిర్ణయించామని చెప్పారు. అలాగే ఆటా-తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎనిమిది మందితో కూడిన ఈ బృందం 2019 జూన్ నుంచి 2020 డిసెంబరు వరకు సేవలందిస్తుందని చెప్పారు. అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో మరో 27 మంది నూతన సభ్యులను చేర్చుకున్నట్లు చెప్పారు.

 

నూతన కార్యవర్గం:
  • మాధవరం కరుణాకర్, చైర్మన్
  • వినోద్ కుకునూర్, ప్రెసిడెంట్
  • నరేందర్ చేమర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్
  • సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, పాస్ట్ ప్రెసిడెంట్
  • వెంకట్ మంతెన, ప్రధాన కార్యదర్శి
  • రామచంద్రా రెడ్డి, కోశాధికారి
  •  చందు తాళ్ల,  ఉప కార్యదర్శి
  • శ్రీనివాస్ రెడ్డి బండారపు, ఉప కోశాధికారి