న్యూయార్క్: రాజధాని అమరావతికి మద్దతుగా నార్త్ అమెరికాలోని వివిధ నగరాలలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడ్డంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకు తరలించాలని చూస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రకు వ్యతిరేకంగా ప్రవాసాంధ్రులు గళమెత్తారు. ఆంధ్ర ఎన్నారైలందరూ ఒక తాటి మీదకు వచ్చి నార్త్ అమెరికాలో దాదాపు 25 నగరాలలో #SaveAmaravati, #SaveAmaravatiFarmers, #SaveAndhraPradesh అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. బేఏరియా, అట్లాంటా, హూస్టన్, షార్లెట్, మిన్నియాపాలిస్, టొరంటో, ఒమాహా, ఫిలడెల్ఫియా, కాన్సాస్ సిటీ, డెస్ మోయిన్స్, పోర్ట్ ల్యాండ్, కిచెనర్, చికాగో, విల్మింగ్టన్, ఆస్టిన్, ఎడిసన్, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, అష్బర్న్, బోస్టన్, రాలే, హార్ట్ఫోర్డ్, సెయింట్ లూయిస్, అరోరా తదితర నగరాల్లో ర్యాలీ నిర్వహించారు.