American-shocked-to-find-Rs.-264-crore-utility-bill

రూ.264 కోట్ల కరెంట్ బిల్.. షాకైన అమెరికన్

ఆస్టోరియా: అమెరికాలో ఓ వ్యక్తికి రూ. 264 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. అంత కరెంటు బిల్లు చూసిన అమెరికన్‌కు నోట్లో మాట కూడా రాలేదు. ప్రతి నెలా మాదిరిగానే ఈ నెల కరెంటు బిల్లును కూడా ఆన్‌లైన్‌లో కట్టాలనుకుని టామీ స్ట్రాబ్ అనే వ్యక్తి కరెంట్ బిల్ యాప్ ఓపెన్ చేశాడు. పేమెంట్ ఆప్షన్‌కు వచ్చేసరికి అక్కడ 38 మిలియన్ డాలర్లు(రూ. 264 కోట్ల 36 లక్షలు) కట్టాల్సిందిగా కనిపించింది. దీంతో అమెరికన్‌కు ఏం చేయాలో తోచక వెంటనే ట్వటర్‌ ద్వారా కరెంట్ బిల్ కంపెనీకి ట్వీట్ చేశాడు. తాను 600 చదరపు అడుగుల స్టూడియోను నడుపుకుంటున్నానని, తనకు వచ్చిన బిల్లు కేవలం 77 డాలర్లు(రూ. 5300) అని తెలిపాడు. దీనిపై కంపెనీ వెంటనే స్పందించింది. జరిగిన తప్పును సరిదిద్దుతున్నామని ట్వీట్ చేసింది. కొన్ని గంటల తర్వాత మరోమారు యాప్ చూసుకోగా.. 77 డాలర్ల బిల్లు కనిపించింది. తప్పు తమవైపు ఉన్నప్పటికీ.. కంపెనీ టామీకి క్షమాపణలు కూడా చెప్పలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.