A-man-got-to-experience-the-private-jet-life-when-he-was-the-only-passenger-on-his-Delta-flight

700 కిలోమీటర్లు.. విమానంలో ఒక్కడే ప్రయాణం

ఊటా: విమానం ఒక్కసారైనా ఎక్కాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. తీరా విమానం ఎక్కిన తరువాత ఆ కోరిక తీరుతుందా అంటే చాలా మందికి తీరదు. ఎకానమీ క్లాస్‌లో కూర్చున్నాం.. ఒక్కసారైనా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనే కోరిక మొదలవుతుంది. బిజినెస్ క్లాస్‌లో కూడా కూర్చున్న వాళ్లకు ఇక ప్రైవేట్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో అన్న కోరిక స్టార్ట్ అవుతుంది. విమానంలో సోలోగా, లగ్జరీగా ప్రయాణిస్తే ఆ కిక్కే వేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు. అమెరికాలో మాత్రం ఓ వ్యక్తికి ఆ అదృష్టం వరించింది. అది కూడా సాధారణ విమానంలో ప్రైవేట్ ఫ్లైట్ అనుభూతిని పొందాడు. ఎలా అంటారా? 

సౌత్ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన డీఎల్3652 విమానం అమెరికాలోని కొలరాడో నుంచి ఊటాకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ విమానంలో ఒక్క సీటు మాత్రమే బుక్ అయింది. ఆ సీటును న్యూయార్క్‌కు చెందిన రైటర్, డైరెక్టర్‌ విన్సెంట్ పియోన్ అనే వ్యక్తి బుక్ చేసుకున్నాడు. ఒక్క ప్రయాణికుడే ఉన్నప్పటికీ యాజమాన్యం ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేయలేదు. దీంతో దాదాపు 700 కిలోమీటర్లు విమానంలో విన్సెంట్ ఒక్కడే జాలీగా ప్రయాణించాడు. ఒక్కడే అయినప్పటికీ.. ప్రయాణికులకు చేయాల్సిన మర్యాదలు అన్నీ ఎయిర్‌‌హోస్టెసెస్ చేశారు. ఈ ప్రయాణాన్ని తన జీవితంలో మర్చిపోలేనని.. మొత్తం వీడియో తీసి విన్సెంట్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. 
ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది స్పందించింది. విమానాన్ని రద్దు చేస్తే వేరే విమానాల ల్యాండింగ్‌కు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ కారణంగానే ఒక్క ప్రయాణికుడితోనే ప్రయాణాన్ని నడిపించినట్టు సిబ్బంది తెలిపింది.