8-feet-sinkhole-spotted-on-the-road

8 అడుగుల లోతుకు రోడ్డు కుంగిపోయి..

ఫ్లోరిడా: కారు చాలా వేగంగా వెళ్తోంది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా పెద్ద గుంతలో కారు పడిపోయింది. కారులో ఓ మహిళ మరో వ్యక్తి ఉన్నారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు, ఎమర్జెన్సీ ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని కారులోని వ్యక్తులను రక్షించారు. ఒక్కసారిగా రోడ్డుపై ఎనిమిది అడుగుల లోతు గుంత ఏర్పడింది. భూమి కుంగిపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు తేల్చారు. గుంత ఏర్పడిన ప్రాంతం గతంలో నీటి పంపింగ్ కోసం తవ్విన గుంత అయి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గుంత సరైన పద్ధతిలో పూడ్చకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదని వారు తెలిపారు.