6-year-old-blind-piano-prodigy-goes-viral

ఆరేళ్ల బాలుడు చేసిన పని.. వైరల్‌గా మారి..

ఫ్లోరిడా: ఆరేళ్ల బాలుడు పియానో ప్లేయర్‌గా మారాడు. ఎంతో మంది అతడికి అభిమానులు ఉన్నారు. ఆరేళ్లకే అంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం మాములు విషయం కాదంటోంది. ఆ బాలుడి తల్లి సారా మూర్. సోషల్ మీడియాలో రే మానేస్(6) అనే బాలుడి వీడియో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోను అతడి తల్లి సారా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో చూసి ప్రముఖ సింగర్లు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారని సారా చెబుతోంది. తన కొడుక్కి అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ అతడికి చూపు లేదని పుట్టుకతోనే అంధుడని సారా తెలిపింది. అయితే తన కొడుకు రే సంగీతం పట్ల ఏర్పడిన అభిరుచిని గమనించి పియానో నేర్పించామని సారా తెలిపింది. అతడికి సంగీతం నేర్పే టీచర్ కూడా రే టాలెంట్ చూసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కేవలం రాగాలను విని పియానో ప్లే చేయడం రే ప్రత్యేకత అని సారా తెలిపింది.