40-Years-After-Crimes,-Man-Charged-With-100-Counts-of-Rape

అత్యాచారం జరిగిన 40 ఏళ్ల తరువాత.. 71 ఏళ్ల వృద్దుడిపై..

లూసియానా: అత్యాచారం జరిగిన 40 ఏళ్ల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడం అన్నది ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండం. అమెరికాలోని లూసియానా ప్రాంతంలో మాత్రం వందలాది మంది మహిళలు తమపై 40 ఏళ్ల క్రితం హార్వే ఫౌంటేన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. లూసియానాలోని పైన్‌విల్లే అనే ప్రాంతంలో హార్వే దశాబ్దాలుగా నివాసముంటున్నాడు. 1970ల చివర్లో 13 ఏళ్ల బాలికలపై హార్వే అత్యాచారం చేశాడని ప్రస్తుతం కేసు నమోదైంది. తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావాలని అదే ప్రాంతానికి చెందిన మహిళ ఏప్రిల్ 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం హార్వేను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో వంద మందికి పైగా మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. లూసియానా చట్టం ప్రకారం మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధిస్తారు. 71 ఏళ్ల వయసున్న హార్వే పది లక్షల డాలర్ల పూచీకత్తుగా చెల్లిస్తే విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, అతని తరపున వాదించడానికి ఏ ఒక్క లాయర్ లేనట్టు తెలుస్తోంది.