146th-TANTEX-NNTV-and-Texas-43rd-Sahitya-Sadassu

టాంటెక్స్ 'నెల నెలా తెలుగు వెన్నెల' 146వ సాహిత్య సదస్సు

త్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) వారి ఆధ్వర్యంలో 146వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు, 43వ టెక్సాస్ సాహిత్య సదస్సుని అర్వింగ్ పట్టణంలో కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశభక్తి గీతంతో మొదలయింది. అనంతరం పేరులో ఏముంది అనే అంశంపై సత్యం మందపాటి మాట్లాడారు. చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా లిఖించాలన్న విషయం మీద హరి మద్దూరి మాట్లాడితే, సాహిత్యంలో ధిక్కారం అనే అంశం మీద నందివాడ భీమ రావు గారు మాట్లాడారు. సమాజంలో పేదలకి జరిగే అన్యాయం మీద ప్రశ్నించాలని చెప్పారు. మెడికో శ్యాం సాహిత్యంలోని అనేక అంశాల మీద వివరణ ఇచ్చారు. పరీక్ష సమీక్ష అనే అంశం మీద డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్ మాట్లాడారు. ఆమె జర్నలిస్ట్ నండూరి రామ మోహన్ రావు గురించి కూడా  వివరించారు. ధారావాహిక కార్యక్రమంలో భాగంగా మన తెలుగు సిరిసంపదలు అనే అంశం గురించి డాక్టర్ నరసింహా రెడ్డి చక్కటి వివరణ ఇచ్చారు. ఎందరో మహానుభావులు - ఆధునిక సమాజపు కవితా ప్రయోజనం అనే అంశం మీద లెనిన్ మాట్లాడారు. సత్య హరిచంద్ర నాటకంలోని పద్యాలు పాడి వాటి భావనని రామచంద్ర నాయుడు వివరిస్తే, గుర్రం జాషువా గారి గురించి సురేష్ కాజా, జాలాది గురించి చంద్రహాస్ మద్దుకూరి వివరించారు.
 
చివరగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్, సానాంటోనియో, టెంపుల్ నగరాల నుండి వందల మంది సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్య ప్రియులంతా స్వీయకవితలు, వ్యాసాలు, పద్యాలు, తెలుగు సిరిసంపదలు విని పులకించిపోయారు. ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణా రెడ్డి కోడూరు అధ్యక్షత వహించగా, అధ్యక్షులు చిన సత్యం, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, కార్యవర్గ సభ్యుడు సతీష్‌తో పాటు పూర్వాధ్యక్షులు డా. ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, ప్రసాద్ తోటకూర, పాలకమండలి సభ్యులు, మాజీ అధినేత చంద్ర కన్నెగంటి, డా.శ్రీనివాసుల రెడ్డి ఆళ్ళ, పాలకమండలి మాజీ అధినేత రామకృష్ణా రెడ్డి దంపతులు, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం, శిరీష గోమటం సుమ పోకల, సీయస్ రావు, ఆర్‌కే పండిటి, నందివాడ ఉదయ భాస్కర్, కిరణ్మయి వేముల తదితరులు సుమారు 200 మంది వరకు హాజరయ్యారు.