1-year-old-boy-killed-in-front-of-parents-in-tragic-accident

అమెరికాలో ఘోరం.. తల్లిదండ్రుల కళ్ల ముందే ఏడాది కొడుకు దుర్మరణం

నార్త్ కెరోలినా: అమెరికాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ఎదురుగానే ఏడాది పసిబిడ్డ ప్రాణాలు పోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ కెరోలినాలో ఓ ఇంటి వెనుక ఉన్న స్థలంలో తల్లిదండ్రులు, పిల్లలు సరదాగా గడుపుతున్న సమయంలో అక్కడే పార్క్ చేసిన ఓ కారును వెనక్కు డ్రైవ్ చేయడంతో.. కారు కింద పడి ఏడాది బిడ్డ మృతిచెందాడు. ఆ ఇంట్లోని వ్యక్తే ఈ ఘటనకు కారణమవడం గమనార్హం. ఇంట్లోని వ్యక్తి వెనక్కు చూసుకుంటూ వెళ్లినప్పటికీ.. ఏడాది బిడ్డ అద్దంలో కనిపించకపోవడంతో ఆ పసిబిడ్డ మీద నుంచి కారు వెళ్లిపోయింది. వెంటనే ఆ పసిబిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి లాభం లేకపోయింది. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.