-jewelry-store-owner-his-wife-stop-would-be-robber

ఓ జువెల్లరీ షాపులో దొంగతనం చేసేందుకు వెళ్లి..

ఫ్లోరిడా: ఓ జువెల్లరి షాపులో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని షాపు యజమాని అతడి భార్య కలిసి  అడ్డుకున్నారు. డియస్‌హెచ్ అనే జువెల్లరి షాపులో ఓ వ్యక్తి గతంలో బంగారు గొలుసు కొన్నాడు. అది విరిగిపోవడంతో అతడు మళ్లీ షాపు యజమాని వద్దకు దాన్ని తీసుకొచ్చాడు. తనకు మరో బంగారు గొలుసు కావాలని గొడవ చేయడం ప్రారంభించాడు. విరిగిన గొలుసును బాగు చేసి ఇస్తామని కొత్త గొలుసు ఇవ్వడం కుదరదని షాపు యజమాని తేల్చిచెప్పాడు. దాంతో అతడు షాపు యజమానితో గొడవకు దిగాడు. కొద్దిసేపటికే అతడు షాపులో నుంచి దౌర్జన్యంగా నగలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడున్న డేనియల్ అనే వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. డేనియల్ గతంలో ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేశారు. డేనియల్ అతడిపై దాడి చేస్తుండటంతో షాపు యజమాని భార్య కూడా ముందుకు వచ్చింది. హకీ స్టీక్ తీసుకుని దుండగుడిపై దాడికి దిగింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న గొలుసు తీసుకుని దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు.