Special-article-on-NRI-Appireddy

రియల్ శ్రీమంతుడు.. ఈ ఎన్నారై ‘అప్పిరెడ్డి’

మేళ్లచెర్వు: సూర్యాపేట జిల్లాలోని ఉమ్మడి మేళ్లచెర్వు మండలంలో ని మారుమూల ప్రాంతమైన దొండపాడు గ్రామాన్ని  డిజిటల్‌ గ్రామంగా మార్చాలనే తపనతో ఆ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ అన్నపురెడ్డి అప్పిరెడ్డి సొంత ఊరును దత్తత తీసుకున్నారు. డిజటల్‌ అక్షరాస్యత దొండపాడుగా మార్చారు. కనీసం స్మార్ట్‌ ఫోన్‌పై కూడా అహగాహన లేని 218 మంది గ్రామస్థులకు 6 నెలల పాటు  కంప్యూటర్‌ శిక్షణ ఇప్పించారు. శిక్షణలో డిజిటల్‌ లావాదేవీల పరిజ్ఞా నం పొంది ఇప్పుడు వారు మెయిల్‌ చేయడం, బ్యాంకు లావాదేవీలు, వెబ్‌బ్రౌజింగ్‌ చేస్తున్నారు. 

ఐఐటీ హైదరాబాద్‌ వారు  రూపొందించిన  వ్యవసాయరంగంలోని ఆధునిక పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తులను, మార్కెట్‌లో తగిన ధరలకు విక్రయించే ఆసక్తి కరమైన విషయాలను డిజిటల్‌ శిక్షణలో భాగంగా టీటా సభ్యులు పొందుపరిచారు. కంప్యూటర్‌ శిక్షణ పొందిన వారు కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పండించిన పంటల ధర ల క్రయ విక్రయాలను , పలు ఆసక్తి కరమైన విషయా లు తెలుసుకోవడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) ద్వారా డిజిథాన్‌ సంస్థ వారు డిజిటల్‌ గ్రామాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.   
 
పలువురికి ఉపాధి కల్పన...
ఎన్‌ఆర్‌ఐ అప్పిరెడ్డి సొంత గ్రామమైన దొండపాడు గ్రామాన్ని డిజిటల్‌ గ్రామంగా మార్చడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పరిచయస్థుల పిల్లలు బీటెక్‌ పూర్తి  చేసి న  నిరుద్యోగులకు అమెరికా, హైదరాబాద్‌లో ఉన్న అత ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఆయనకు తెలిసిన కంపెనీల్లో ఎంతో మంది నిరుద్యోగుల కు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. పేద విద్యార్థులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో 2012లో ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. 2012నుంచి  దొండపాడు,  మేళ్లచెర్వు, చింతలపాలెం, గుడిమల్కాపురం, వజినేపల్లి, కోదాడ, రాఘవాపురం, ద్వారకుంట గ్రామాల్లో  ప్రతి సం వత్సరం సుమారు 80మంది పేద విద్యార్థులకు  రూ.5లక్షల ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
 
నాటి రైతు బిడ్డ..
ఎన్‌ఆర్‌ఐ అప్పిరెడ్డి రైతు కుటుంబంలో 1980 సంవత్సరంలో అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి అక్క మ్మ దంపతులకు జన్మించారు. దొండపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తదరగతి, ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని విశ్వభారతి కళాశాలలో ఇంటర్మీడియట్‌, కోదాడలోని ఎంఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌  విద్యనభ్యసించారు. 2003నుంచి 2007వరకు సౌత్‌ఆఫ్రికా, లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశారు. 2008లో అమెరికా కు వెళ్లి అక్కడ  ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్‌ అభివృద్ధి నిపుణుడిగా పనిచేశారు. రైతు కుటుంబంలో జన్మించిన అప్పిరెడ్డి అంచెలంచెలగా ఎదుగుతూ అమెరికా, హైదరాబాద్‌లో 10 సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలను స్థాపించి ఆ కంపెనీల్లో సుమారు 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. 

అప్పిరెడ్డి సేవవలు ఆదర్శం..
అన్నపురెడ్డి అప్పిరెడ్డిని ఆదర్శంగా తీసుకున్న 40 మంది ఎన్‌ఆర్‌ఐలు వారి సొంత గ్రామాలను దత్తత తీసుకుని డిజటల్‌ గ్రామాలుగా మార్చేందుకు కంప్యూటర్‌ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ అప్పిరెడ్డి దొండపాడు గ్రామాన్ని డిజిటల్‌ గ్రామంగా మార్చడమే కాకుండా 2012లో ఏహెచ్‌ఆర్‌(ఆదెమ్మ హుస్సేన్‌రెడ్డి) ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి అప్పటి నుంచి పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్ధేశంతో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. దొండపాడు గ్రామాన్ని డిజిటల్‌ గ్రామంగా మార్చిన అన్నపురెడ్డి అప్పిరెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా బ్రాండ్‌ అంబాసిడర్‌గా అవార్డు లభించింది.
 
పేద విద్యార్థులకు చేయూత..
పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎగేందుకు 2012 సంవత్సరంలో ఏహెచ్‌ఆర్‌ పౌండేషన్‌ స్థాపించి, ఆ ఫౌండేషన్‌ ద్వారా ప్రతి సంవత్సరం పేద విద్యార్థుల కు ఉపకార వేతనాలు అం దిస్తున్నాం.  ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్స రం 80 విద్యార్థులకు 5 లక్షల రూపాయల  ఉపకార వేతనాలు అందిస్తున్నాం. వచ్చే సంవత్సరం మరో 50 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.  బీటెక్‌ పూర్తి  చేసిన నిరుద్యోగులకు తన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీల్లో ఉద్యోగావశాలు కల్పిస్తున్నాం. వేరే కంపెనీల్లో సుమా రు 1000 మందికి ఉద్యోగాలిప్పించాం. ఒకరికి సహా య పడినప్పుడే  వారి దీవెనలు, ఆ దేవుడి కరుణతో మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాం.
-  అన్నపురెడ్డి అప్పిరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ