:: Welcome to NRI - Article ::

అంతర్జాతీయ రక్తమార్పిడి సంస్థ చీఫ్‌గా రవిరెడ్డి

దక్షిణాఫ్రికాకు చెందిన తెలుగు సంతతి వ్యక్తి నియామకం 

జొహన్నెస్‌బర్గ్‌, సెప్టెంబరు 18: దక్షిణాఫ్రికాకు చెందిన తెలుగు సంతతి వ్యక్తి రవిరెడ్డి అత్యున్నత పదవిలో నియమితులయ్యారు. ప్రంపచవ్యాప్తంగా సురక్షిత రక్త మార్పిడికి కృషి చేస్తున్న అంతర్జాతీయ రక్త మార్పిడి సంఘం(ఐఎస్‌బీటీ) అధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆఫ్రికా ఖండం నుంచి ఈ సంస్థకు అధిపతిగా నియమితులైన తొలి వ్యక్తి ఆయనే. ఆమ్‌స్టర్‌డామ్‌ కేం ద్రంగా 1935లో ఏర్పాటెన ఐఎ్‌సబీటీ... 100 సభ్యదేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కాగా, రవిరెడ్డి ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ రక్త సేవల సంస్థ(ఎ్‌సఏఎన్‌బీఎ్‌స)కు చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ రోగులు అధికంగా ఉన్న నేపథ్యంలో సురక్షిత రక్తదాన, రక్త మార్పిడి పద్ధతులు ప్రవేశపెట్టేందుకు ఆయన విశేష కృషి చేశారు. ఎస్‌ఏఎన్‌బీఎ్‌సలో 16 ఏళ్లకే కార్యకర్తగా చేరిన ఆయన.. 3 దశాబ్దాలుగా సేవలందిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.

 

Loading...