:: Welcome to NRI - Article ::

అమెరికా ఫెడరల్‌ జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 14: భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది డయానా గుజరాతీ(47) అమెరికా ఫెడరల్‌ జడ్జిగా నియమితులయ్యారు. డయానాను న్యూయార్క్‌లోని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు బెంచిలో జడ్జిగా నియమిస్తున్నట్లుగా అధ్యక్షుడు ఒబామా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ప్రజలకు ఆమె ఘనమైన సేవలందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.