most-effective-woman-in-UK-is-Indian

యూకే ‘అత్యంత ప్రభావశీలి’గా భారత సంతతి మహిళ

లండన్‌, అక్టోబరు 25: యూకేలోని ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన ‘వంద మంది అత్యంత ప్రభావశీల నల్ల జాతీయుల జాబితా- 2018’లో భారత సంతతి వ్యాపారవేత్త గినా మిల్లర్‌ మొదటి స్థానంలో నిలిచారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేశారు. బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదం లేకుండా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదోలగాలన్న ఆ దేశ ప్రధాని థెరిసా మే అధికార పరిధిని ప్రశ్ని స్తూ మిల్లర్‌ కోర్టుకెక్కగా.. అనుకూలంగా తీర్పు రావడం విశేషం.