:: Welcome to NRI - Article ::

భారత సంతతి శాస్త్రవేత్తకు మిట్‌ అవార్డ్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 14: భారత సంతతి శాస్త్రవేత్త, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(మిట్‌) అసొసియేట్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ రస్కర్‌(46)కు అరుదైన గుర్తింపు లభించింది. నాసిక్‌లో జన్మించిన రస్కర్‌.. ప్రతిష్ఠాత్మకమైన లెమెల్సన్‌-మిట్‌ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద అతనికి 5లక్షల డాలర్లు(రూ.3.35 కోట్లు) లభిస్తాయి.