Miryalaguda-NRI-helps-to-his-own-village

సొంతూరిపై ఎన్నారై మమకారం

విద్య, వైద్య సేవల్లో సహకారం

పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న దుర్గాప్రసాద్‌ 

మిర్యాలగూడ టౌన్, నల్గొండ‌: మిర్యాలగూడ పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్‌ వనమాల వృత్తిరిత్యా అమెరికా లో స్థిరపడ్డాడు. ఆయనకు సొంతూరన్నా.. ప్రాంతమ న్నా ఎనలేని అభిమానం. ఎలాంటి పనులు చేస్తే జన్మనిచ్చిన ఊరికి, చదువుకున్న బడికి, ఊళ్లో చదువుతున్న విద్యార్థులకు తమ సహకారం అందుతుందని ఆలోచిస్తుంటాడు. ప్రతినిత్యం బీజీగా ఉండే ఆయన తన సంపాదనలో పొదుపు చేసిన కొంతను ఇక్కడి విద్యార్థు లు క్రీడాకారులకు సాయమందిస్తున్నాడు. ముందస్తు ప్రణాళికతో మిత్రులు, బంధువుల సహకారంతో ఎవరికి ఏ సాయం చేయాలి, ఏ పాఠశాలకు ఏమివ్వాలనేది నిర్ణయించుకుని సాయమందిస్తున్నాడు. విద్యాలయాలు, దేవాలయాలతో పాటు అనాథ ఆశ్రమాలకు సేవలంది స్తూ ఔదార్యం చాటుకుంటున్నారు.
 
విద్యా, క్రీడా రంగాలకు సేవలు...
మృదుస్వభావి అయిన దుర్గాప్రసాద్‌ విద్యా, క్రీడా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పూనుకున్నాడు. ప్రతిభగల నిరుపేద విద్యార్థులకు సొంత ఖర్చులతో ఉన్నత చదువులు చెప్పించిన ఆయన మా రుతున్న విద్యావిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆధునిక క్లాస్‌ రూమ్స్‌తో సాటు వసతి సౌకర్యాలు అందట్లేదని వాపోతున్నాడు. ఒక్కరో, ఇద్దరో సహాయం చేస్తే వ్యవస్థ మారదని, ప్రభుత్వ విధానాలే మారాలని అభిప్రాయపడుతున్నాడు. అంతేగాక తన మిత్రులు స్థా పించిన మన మిర్యాలగూడ సామాజిక మాధ్యమ సంస్థలో ఎన్నారై విభాగంలో అడ్మిన్‌గా,  క్రియాశీల క సభ్యుడిగా సేవలందిస్తున్నాడు. విద్యార్థులు, పా ఠశాలలు, అనాథాశ్రమాలు, దేవాలయాలు,  మౌలిక వసతుల కల్పనకు సాయమందిస్తున్నాడు. 
 
మిత్రుల సహకారంతోనే...
మిత్రుల సహకారంతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. విద్యా విధానంలో అనేక మార్పులొస్తున్నాయి. డిజిటల్‌ విద్య, కంప్యూటర్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ పరీక్షలు ఇలాం టి మార్పులకు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించాన్నదే నా సంకల్పం. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎందరో సర్కారు బడుల్లో చదువుతున్నారు. వారికి తగిన ప్రోత్సాహం లేక మరుగున పడుతుండటం బాధ కలిగిస్తోంది. 
-దుర్గాప్రసాద్‌, యూఎస్‌ఏ