:: Welcome to NRI - Article ::

అమెరికాలో సిరిపురం వైద్యురాలు

మల్ట్టిపుల్‌ స్లికోరోసిస్‌ వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తున్న డాక్టర్‌ స్వాతి

మనదేశంలో ప్రతీ పదివేల మందిలో 15శాతం మంది బాధితులు
న్యూరాలజీ జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనాంశాలు

ఖమ్మం, వైరా: అమెరికాలో మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ న్యూరాలజీ ఆఫ్‌ ఫిజియోథెరపీ వైద్యురాలిగా ఎన్నారై  డాక్టర్‌ బాలాంత్రపు స్వాతి రాణిస్తూ ప్రశంసలందుకుంటున్నారు.  మల్టిపుల్‌ స్లికోరోసిస్(ఎంఎస్)అనే వ్యాధికి సంబంధించి ఆమె ఫిజియోథెరపీలో అమెరికాలో వైద్యసేవలు అందిస్తున్నారు.  ఆవ్యాధికి సంబంధించిన ప్రపంచఖ్యాతి గడించిన న్యూరాలజీ  జర్నల్స్‌లో కూడా ఆమె రాసిన  కథనాలు ప్రచురితమయ్యాయి.  
 
హైదరాబాద్‌కు చెందిన స్వాతికి ఖమ్మంజిల్లా వైరా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కందిబండ రాజేష్‌తో వివాహం జరిగింది. ఈమె ప్రస్తుతం కాలిపోర్నియాలోని శాన్‌ప్రాన్సిస్‌కోలో నివాసముంటూ వైద్యసేవలందిస్తున్నారు. ఇప్పటికే స్వాతి అందిస్తున్న వైద్యసేవలకు సంబంధించి అమెరికాలో జర్నల్స్‌లో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈమ్యున్‌డిమైల్‌లేటింగ్‌ అనే ఒక వ్యాధి మల్టీపుల్‌ స్లికోరోసి్‌సగా ఉంది. ఈ వ్యాధి మధ్యనాడిమండలం, మెదడు, వెన్నుపూసకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి అమెరికాలో వెయ్యిమందిలో ఒకరికి కన్పిస్తుంది. మన దేశంలో ప్రతీ పదివేల మందిలో 15శాతం మందికి సోకుతుంది. ఇంకా ఈ గణాంకాలు ఎక్కువ ఉండే అవకాశముంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన సరైన పరికరాలు అందుబాటులో లేవు. ఈ వ్యాధి వలన అధిక బరువుతో డిప్రెషన్‌కు లోనై శారీరక అంగవైకల్యం ఏర్పడటం ముఖ్యలక్షణాల్లో ఒకటి. కంటిచూపు కోల్పోవటం, అలసిపోవడం, అధిక బరువు, మతిమరుపు, మూత్రవిసర్జనలో ఇబ్బందికలగటం ప్రధాన లక్షణంగా ఉంది. ఈ వ్యాధి 50సంవత్సరాలుపైబడిన వారికి ఎక్కువగా అలాగే యుక్తవయస్సులో కూడా కొంతమందికి వచ్చే అవకాశముంది. ఇది జన్యుపరంగా వచ్చే వ్యాధి. 
 
 డాక్టర్‌ స్వాతి మరికొంతమంది వైద్యబృందం యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయస్‌ అర్బన్‌ షాంపేయింగ్‌లో పరిశోధన చేసి ఈ వ్యాధి నివారణోపాయాలు కనుగొన్నారు. డాక్టర్‌ స్వాతి ప్రపంచ స్థాయిలోనే ఫిజికల్‌ థెరఫిస్టుగా రాణిస్తున్నారు. ఈ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు చేసిన అంశాలు ప్రపంచఖ్యాతి ఘడించిన న్యూరాలజీ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈవ్యాధి లక్షణాలు ఉన్న వారు అందుబాటులో ఉన్న న్యూరాలజిస్టును సంప్రదించి వెంటనే వ్యాధిని నిర్ధారించుకొని వైద్యం పొందాలని డాక్టర్‌ స్వాతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలంటే డాక్టర్‌.బాలాంత్రపు@స్వాతి లేదా 14@జీమెయిల్‌.కామ్‌లో సంప్రదించాలని సూచించారు. ఆమె భర్త కందిబండ రాజేష్‌ యాపిల్‌ బ్యాటరీ ఆపరేషన్‌ ఇంజనీరింగ్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ అపోలో మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ స్వాతి ఫిజియోథెరపీ చదివారు. ఆతర్వాత అమెరికా వెళ్లి అక్కడ వైద్యసేవలందిస్తున్నారు.