:: Welcome to NRI - Article ::

పసిపిల్లల స్పా.. ఎన్నారై అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచన

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నగరం. ఇక్కడో బేబీ స్పా ఉంది. దీన్ని ప్రారంభించినవారి పేర్లు అనిత, కవితా కుమార్‌. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. భారత సంతతికి చెందినవారు కావడం మరో విశేషం. బ్యూటీ థెరపిస్ట్ గా పని చేసిన అనుభవం ఇద్దరికీ ఉంది. అనిత కొన్నేళ్లుగా పెర్త్‌లోనే ఉంటోంది. కవిత పిల్లలకు హైడ్రోథెరపీ చేయడంలో దిట్ట. పది సంవత్సరాలపాటు లండన్‌లో ఇదే పని చేసింది. వీరిద్దరూ కలిసి ఒక వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభించినదే ‘బేబీస్పాపెర్త్‌’. ఆరు రోజుల చిన్నారి మొదలు ఆరు నెలలలోపు చిన్నారుల కోసం ఉద్దేశించినది ఇది. ఇందులో పసిబాలలకు రకరకాల మసాజ్‌ చేస్తారు. ఆవిరి స్నానం చేయిస్తారు. పిల్లల మెడకు ట్యూబ్‌ వేసి స్విమ్మింగ్‌ తొట్టిలోకి దించేస్తారు. స్నానానికి స్నానం.. ఆటకు ఆట. కేరింతలు కొడుతూ జలక్రీడలు ఆడుతున్నారు ఆ పసివాళ్లు. నీటిలో ముచ్చటగా సేదతీరుతున్న పిల్లాడు ఒకడు.. మసాజ్‌ చేస్తుంటే ఆదమరచి నిద్దురపోతున్న మరొక బుజ్జాయి.. ఇలా చిన్నారుల రకరకాల పోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పెర్త్‌స్పా గురించి ఎర్త్‌ అంతా పాకిపోయింది. అనిత, కవిత బిజినెస్ కి కావాల్సినంత ప్రచారం దొరికింది.

 

Loading...