:: Welcome to NRI - Article ::

భారత అమెరికన్‌ వైద్యుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు

హ్యూస్టన్‌, అక్టోబరు 2: భారత సంతతి వైద్యుడు వినయ్‌ మంచెయ్య అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. వినికిడి లోపాలకు సంబంధించిన చికిత్సల విభాగమైన ఆడియాలజీలో జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత పురష్కారం ‘జెర్జర్‌ ఫ్యూచర్‌ లీడర్‌ ఆఫ్‌ ఆడియాలజీ’ అవార్డును అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని లామర్‌ యూనివర్సిటీలో ఆడియాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో మెడిసిన్‌ పూర్తి చేశారు. యూకేలోని నోవా యూనివర్సిటీలో డాక్టర్‌ ఆఫ్‌ ఆడియాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌లో ఎంఎస్‌ చేశారు. కాగా, భారతలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం వినయ్‌ ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.