:: Welcome to NRI - Article ::

భారత సంతతి శాస్త్రవేత్తకు ‘సోర్‌’ బంపర్‌ బొనాంజా

కేన్సర్‌పై పరిశోధనకు 53 కోట్లు

వాషింగ్టన్‌: ప్రాణాంతక తల, మెడ కేన్సర్‌పై పరిశోధనకు గానూ ఓ భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికాలోని నేషనల్‌ ఇనిస్ట్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేసియల్‌ రీసెర్చ్‌ సంస్థ భారీ బొనాంజా ప్రకటించింది. పరిశోధనా రంగంలో అవిరళ కృషికి దక్కే ‘సోర్‌’ (రూ.53కోట్లు) అవార్డును నిషా డిసిల్వా దక్కించుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌లో క్లినిషియన్‌-సైంటిస్టుగా పనిచేస్తున్న ఆమె ఎనిమిదేళ్ల పాటు ఈ మొత్తాన్ని విడతల వారీగా అందుకోనున్నారు.