108-NRIs-from-America-for-Krishna-District

కృష్ణా జిల్లాపై ఎన్నారైల మమకారం

సామాజిక మార్పునకు ప్రవాసాంధ్రులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అమెరికాలో 35 రాష్ర్టాలకు చెందిన 108 మంది హాజరు
జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణా జిల్లాపై మమకారంతో సామాజిక మార్పు కోసం అమెరికాలోని పది వేల మంది ప్రవాసాంధ్రులు ఆపన్న హస్తం అందించటానికి ముందుకొచ్చారు. తరగతి గదుల్లో సంపూర్ణ డిజిటల్‌ విద్యా బోధన, అసంపూర్ణ అంగన్‌వాడీ భవనాల అభివృద్ధికి, జిల్లాలోని వేలాది మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలతో పాటు సాధారణ ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటానికి సమాయత్తమయ్యారు. అమెరికాలో పది వేల మంది సభ్యులతో కూడిన కృష్ణా జిల్లాకు చెందిన అతి  పెద్ద ప్రవాసాంధ్ర గ్రూపుతో ఆదివారం జిల్లా కలె క్టర్‌ లక్ష్మీకాంతం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. గ్రూపులోని 108 మంది ప్రతినిధులు 35 రాష్ర్టాల నుంచి పాల్గొన్నారు. ఉత్తర అమెరికా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్‌ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. కలె  క్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ప్రవాసాంధ్ర ప్రతినిధిగా ప్రదీప్‌ కారుటూరి వ్యవహరించారు. మే 3న జిల్లాకు వచ్చి తమ కార్యా చరణను అమలు చేయటంతో పాటు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి మరింత సహకారం అందించేందుకు ప్రకటన చేయనున్నారు. 
 
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవాసాంధ్రులు నాదెండ్ల సురేష్‌, కాశికుర్తి రాజ, పామర్తి రామ  కృష్ణ, నల్లమల రాధాకృష్ణ, రావు ఎస్‌.లింగ, గుమ్మడి రత్నప్రసాద్‌, యార్లగడ్డ రవి, వై.కిషోర్‌ జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ప్రాజెక్టులు, వాటి విధానాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు మొత్తం 108 మంది ప్రవాసాంధ్రులు కలెక్టర్‌తో  మాట్లాడారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లా అభివృద్ధిలో పరు  గులు పెడుతున్న విషయాన్ని కలెక్టర్‌ వివరించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, మెగా నిర్మాణాలు, భారీ మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న పారిశ్రామిక పార్కులు, ఫ్లై ఓవర్లు తదితర విషయాలను వివరించారు. కృష్ణా కలెక్టరేట్‌కు ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్‌ వచ్చిందని, పరిశ్రమలు పెట్టేవారికి సింగి ల్‌ విండో అమలు చేస్తున్నామన్నారు.
 
 జిల్లాలో సాంకేతికంగా అమలు చేస్తున్న పథకాల గురించి మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో పాటు అనేక దేశాల వారు అధ్యయనం చేయటానికి వస్తున్నారని తెలి పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పతాక స్థాయిలో చేపడుతున్నట్టు చెప్పారు. ఆ తర్వాత జిల్లాలో సామాజిక సంక్షేమ కార్య క్రమాల అమలును ప్రస్తావించారు. ఆరు నెలలు కొనసాగించే కార్య  క్రమానికి మూడు నెలలు దీనికి అయ్యే వ్యయాన్ని సంపూర్ణంగా భరిస్తామని ప్రవాసాంధ్ర ప్రతినిధు  లు హామీ ఇచ్చారు. ప్రవాసాంధ్రుల సహకారంతో రూ.3 కోట్లతో జిల్లాలో 200 పాఠ శాలలల్లో డిజిట  ల్‌ తరగతులు ఏర్పాటు చేశామని, ఇంకా 234 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున సర్వ శిక్షా అభియాన్‌ ద్వారా 30 - 40 శాతం నిధులు ఇవ్వగలమన్నారు. దీనికి కూడా ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సాయాన్ని ప్రకటించారు. తాము మిగిలిన 60 శాతం నిధులు సమకూరుస్తామన్నారు. వైద్యపరంగా తాము ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టెలి మెడిసిన్‌ కేంద్రాల ఏర్పాటుకు సహ  కారం అందిస్తామని మరో తీపి కబురు అందించారు. తాము హామీ ఇచ్చిన కార్యక్రమాలలో డిజిటల్‌ తరగతి గదులను నెల రోజుల్లో, అంగన్‌వాడీ భవనాలను రెండు నెలల్లో, మేము సైతం కార్యక్రమాన్ని మూడు నెలల్లో అమలు చేయనున్నట్టు చెప్పారు.