గల్ఫ్ దేశాల్లో 2017లో టాప్ 10 యూట్యూబ్ వీడియోస్

రియాధ్: 2017వ సంవత్సరం పూర్తి కావస్తోంది. మరో సంవత్సరం కాల గర్భంలో కలిసిపోనుంది. కొత్త కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు యువత ఎదురుచూస్తోంది. గడిచిన యేడాది కాలంగా ఏం సాధించాం.. అనేది అందరూ లెక్కలేసుకుంటూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా గడిచిన ఏడాది కాలంగా ఏఏ అంశాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి..? తీవ్ర చర్చనీయాంశమయ్యాయి..? ఏఏ వీడియోలను ఎక్కువ మంది చూశారు..? అనే అంశాలను యువత ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటుంది. ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకు, అరబ్ దేశాలకు స్పష్టమైన తేడా ఉంటుంది. అక్కడి ప్రజల అభిరుచులకు, ఇతర దేశాల పౌరుల అభిరుచులకు వ్యత్యాసం ఉంటుంది. మరి అరబ్ దేశాల పౌరులు ఎక్కువగా వీక్షించిన యూట్యూబ్ వీడియోలు ఏవో ఓ లుక్కేయండి. వాటిని మీరూ ఓ చూపు చూసేయండి. అరబ్ దేశాల్లో అత్యధిక మంది వీక్షించిన వీడియోల్లో సౌదీకి చెందిన బాలికల వీడియో ‘ఖామ్సా అడ్వా’ నిలిచింది. ఈ వీడియోను ఏకంగా 140 మిలియన్ల మందీ వీక్షించారు. 


అరబ్ దేశాల్లో టాప్-10 యూట్యూబ్ వీడియోలు: 
1. Khamsa Adwaa: Hush (143,510,092 views)
2. Saad Lamjarred: Let Go (100,472,772 views)
3. Nasr Al Bahhar: Ma Rad Ilay (65,585,721 views)
4. Aymane Serhani: Nebghi Djini Bsurvet (62,989,408 views)
5. Cairokee & Tarek El Sheikh: Al Keif (52,426,149 views)
6. Abu & Yousra: Talat Daqat (50,270,290 views)
7. Asma Lmnawar: Andou Zine (50,153,950 views)
8. Dyler: Samooly (37,753,080 views)
9. Elissa: Aaks Elli Shayfenha (28,889,365 views)
10. Tamer Hosny: Allah Shahid (27,044,434 views)