:: Welcome to NRI - Article ::

పాస్‌పోర్ట్‌పై తల్లిదండ్రుల పేర్లు సరిచేసుకోవడమెలా..

 

విదేశాల్లో ఉండేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీసా, పాస్‌పోర్ట్‌, పీఐవో కార్డుల వంటివే కాపాడతాయి. అయిఏ వాటిపై ఏ మాత్రం పేరు తప్పుగా ఉన్నా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. పాస్‌పోర్టుపై వ్యక్తి పేరుతోపాటు అతడి తల్లిదండ్రుల పేర్లు కూడా ఉంటాయి. వాటి స్పెల్లింగ్‌లో ఏమాత్రం తేడా ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాస్‌పోర్టుపై తల్లిదండ్రుల పేర్లను సరి చేసుకోవాలనుకునే వారికి ఈ కథనం ఉపయోగపడుతుంది. 
దరఖాస్తు విధానం:
1. http://passport.gov.in/nri/Online.do  లింక్‌ను ఓపెన్‌ చేయండి
2. ఈ లింక్‌ ఓపెన్‌ అయిన తర్వాత ‘సర్వీస్‌ డిజైర్డ్‌’ అని ఉన్న చోట ‘రీ-ఇష్యూ ఆఫ్‌ పాస్‌పోర్టు’ను సెలక్ట్‌ చేసుకోవాలి.
3. ఆ తర్వాత దరఖాస్తును పూర్తి చేస్తూ ‘చేంజ్‌ ఇన్‌ ఎగ్జిస్టింగ్‌ పర్సనల్‌ పర్టిక్యులర్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత దానిలో ‘పేరెంట్‌ నేమ్‌’ ను క్లిక్‌ చేయాలి.
4. దరఖాస్తును నింపి దాని కాపీని తీసుకోవాలి. దానికి సంబంధిత పత్రాలను జతచేసి మెయిల్‌ ద్వారాగానీ, నేరుగా గానీ ఎంబసీ/ కాన్సులేట్‌కు పంపించవచ్చు.
5. ఎంబసీ/ కాన్సులేట్‌ అధికారుల అనుమతి తీసుకుని తత్కాల్‌ సర్వీసును ఉపయోగించవచ్చు.
 
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు
1. ఒరిజినల్‌ పాస్‌పోర్టు కాపీ
2. పాస్‌పోర్టులోని మెదటి, చివరి రెండు పేజీల కాపీలు
3. తల్లిదండ్రుల పేర్లు కరెక్టుగా ఉన్న ధృవీకరణ పత్రం. జన్మ ధృవీకరణ పత్రం, స్కూలింగ్‌ సర్టిఫికెట్‌ వంటివి జతచేయవచ్చు.
వీటిపై గెజిటెడ్‌ సంతకం చేసి దరఖాస్తుకు జత చేయాలి. దరఖాస్తును సమర్పించేందుకు పాస్‌పోర్టు కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. వారు సూచించిన సమయంలో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును సమర్పించాలి.