పెద్దలను గౌరవించుము.. ఫిలిప్పైన్స్‌లో సూత్రమిది!

ఫిలిప్పైన్స్‌ ఏడు వేల ద్వీపాల సమూహం. ఎటువైపు చూసినా అందమైన సముద్రతీరాలతో.. హడావిడిగా కనిపించే జీవనశైలితోను ఉండే ఫిలిప్పైన్స్‌కు వెళ్లే పర్యాటకులు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

దేశాన్ని అవమానపరచవద్దు..
ఫిలిప్పైన్‌ పౌరులు చాలా స్నేహంగా ఉంటారు. అదే సమయంలో తమ దేశాన్ని చాలా గౌరవిస్తారు. ఎవరైనా తమ దేశం గురించి పల్లెత్తు మాట అన్నా ఊరుకోరు. ఫిలిప్పైన్స్‌కు వెళ్లే పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మత్తుమందుల మాఫియాల గురించి, కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ గురించి అక్కడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిలిప్పైన్స్‌ సమాజంలో వృద్ధులకు అపారమైన గౌరవం ఉంటుంది. వారు కనిపించిన వెంటనే సలాం చేసినట్లు  కొద్దిగా వంగి.. అవతల వ్యక్తి చేతిని తీసుకొని నుదిటికి తాకిస్తారు. దీనినే అక్కడ ప్యాగ్‌మామానో అంటారు. పర్యాటకులు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు కానీ  వయస్సులో పెద్దవారిని కించపరచకుండా మాట్లాడితే చాలు.  ఫిలిప్పైన్స్‌లో శాంతి భద్రతల సమస్యలు ప్రస్తుతం పెద్దగా లేవు కానీ.. పర్యాటకులు తమ జాగ్రత్తలో మాత్రం ఉండాలి. ఉదాహరణకు రాత్రి వేళల్లో నిర్జన ప్రదేశాలలో సంచరించకూడదు. తెలియని ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు.
మతం గురించి వద్దు..
ఫిలిప్పైన్స్‌లో మతం చాలా సున్నితమైన అంశం. అందువల్ల మతానికి సంబంధించిన అంశాలను వీలైనంత వరకూ మాట్లాడకుండా ఉంటే మంచిది. 
 
ఫిలిప్పైన్స్‌ పర్యాటకులు ఆహారం విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దేశంలో శాకాహారం దొరకడం కష్టం. ఫిలిప్పైన్స్‌ వాసులు రకరకాల జంతువులు, పక్షుల మాంసాన్ని తింటారు. మెనూలో పేర్లను సరిగా అర్థం చేసుకోకుండా ఆర్డర్‌ చేయొద్దు