ప్రేమ ద్వీపం సైప్రస్‌

ఏ దేశంలో ఏముంది? 

ఆంధ్రజ్యోతి, 03-04-2018: ‘అనగనగా ఒక పెద్ద సముద్రం.. అందులో ఒక అందాల దీవి..’- ఇలాంటి వర్ణనలు పిల్లల కథల పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ వర్ణనలకు సరిగ్గా సరిపోయే దేశం సైప్రస్‌. మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ ద్వీపపు అందాలను చూడటానికి ప్రతి ఏడాది 20 లక్షలకు పైగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మన దేశం నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అలాంటి ఆ దేశపు విశేషాలేమిటో  తెలుసుకుందాం..
 
ఘన చరిత్ర..
సైప్ర్‌సలో మనకు క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో కట్టిన రోమన్‌ స్నానపు గదులు.. ఇతర కట్టడాలు కనిపిస్తాయి. గ్రీకు గ్రంఽథాల ప్రకారం- ఒకప్పుడు ఈ ద్వీపంలో అఫ్రోడైట్‌ అనే అందమైన యువతి నివసిస్తూ ఉండేది. ఆమె తిరిగిన ప్రదేశాలు.. సందర్శించిన ప్రాంతాలు ఫాపస్‌ అనే పట్టణంలో ఉన్నాయి. ఆమెకు గ్రీకు చరిత్రలో దేవత స్థానం లభించింది. అందుకే సైప్రస్‌ వెళ్లిన పర్యాటకులు ఫాఫ్‌సకు తప్పనిసరిగా వెళ్తారు. అక్కడ ఉన్న కట్టడాలను.. అందమైన సముద్ర తీరాన్ని సందర్శిస్తారు. యూరో్‌పకు చెందిన జంటలు- ఈ పట్టణంలో హనీమూన్‌ జరుపుకుంటూ ఉంటారు.
 
సగం సగం..
సైప్ర్‌సలో సగం ముస్లిములు.. సగం క్రైస్తవులు ఉంటారు. వీరు తమ తమ మత పద్ధతులను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. సైప్రస్‌ పురుషాధిక్య సమాజం. మహిళలకు హక్కులు తక్కువ. ఇప్పటికీ మహిళలకు రాజకీయాల్లోకి ప్రవేశం లేదు. వారు మతపరమైన పదవులను అలంకరించకూడదు. ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య కూడా తక్కువే. ఇలాంటి కఠినమైన చట్టాలున్నా- సైప్ర్‌సలో మహిళా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక సైప్ర్‌సలో యూర్‌పలో పద్ధతులే అమలులో ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ అమెరికన్‌ ప్లగ్‌లు పనికిరావు. యూర్‌పలోని దేశాల కరెన్సీని వాణిజ్య సముదాయాల్లో తీసుకుంటారు. ఈ దేశంలో రోడ్‌ సైన్‌లు లాటిన్‌, టుర్కి్‌షలలో ఉంటాయి.
 
జాగ్రత్తగా మసలుకోవాలి..

సైప్రస్‌ ప్రజలు తమ మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోరు. అందువల్ల పర్యాటకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు కొన్ని పండగల సమయంలో మద్యాన్ని సేవించటాన్ని తప్పుగా భావిస్తారు. అలాంటి సమయాల్లో మద్యాన్ని సేవించి రోడ్ల మీద తిరిగితే కేసులు పెడతారు. అంతేకాదు. క్రైస్తవ మందిరాలు, ముస్లిం మసీదుల్లోకి వెళ్లే సమయంలో కురచ బట్టలు వేసుకొని వెళ్లకూడదు. పూర్తిగా దుస్తులు ధరించి వెళ్లాలి. 

- స్పెషల్‌ డెస్క్‌