:: Welcome to NRI - Article ::

ఈ ప్రశ్నలకు బదులిస్తేనే అమెరికా పౌరసత్వం!

న్యూయార్క్: గ్రీన్‌కార్డు.. అమెరికాలో ఉండే ఎన్నారైల కల ఇది. యేటా ఎన్నో వేల మంది.. అగ్రరాజ్యం ఇచ్చే గ్రీన్‌కార్డు పొందేందుకు ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు 30 ఏళ్లకు పైగానే పడుతోంది. దీన్ని ఇంకాస్త పొడిగించాలంటూ సెనేట్‌లో ఇటీవల బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే అమెరికా వీసా పొందేందుకు ఎంత కష్టపడాలో.. గ్రీన్ కార్డును పొందేందుకు కూడా అంతే ప్రయాసపడాలి. వీసా కోసం ఇంటర్వ్యూకు హాజరయినట్లే గ్రీన్‌కార్డు పొందేందుకు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పది ప్రశ్నలతో  కూడిన పౌర పరీక్షను పాసవ్వాలి. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయో.. వాటి సమాధానాలేంటో ఓ లుక్కేయండి... 

1. రాజ్యాంగంలోని తొలి పది సవరణలను ఏమని పిలుస్తారు? 

సమాధానం : బిల్ ఆఫ్ రైట్స్

2. రాజ్యాంగానికి ఎన్ని సవరణలు జరిగాయి? 

సమాధానం :27

3. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పేరు ఏమిటి?  

సమాధానం :డొనాల్డ్ జాన్ ట్రంప్

 

4. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ పదవిలో లేకపోతే, ఎవరు అధ్యక్షుడవుతారు? 

సమాధానం :స్పీకర్ ఆఫ్ ది హౌస్

5. సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? 

సమాధానం :తొమ్మిది

6. రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న ఒక అధికారం చెప్పండి? 

సమాధానాలు: కరెన్సీ ముద్రణ, యుద్ధ ప్రకటన, సైన్యం ఏర్పాటు, ఒప్పందాలు కుదుర్చుకోవడం.

7. రాజ్యాంగాన్ని ఎప్పుడు రాశారు?

సమాధానం :1787

 

8. తొలి అధ్యక్షుడు ఎవరు? 

సమాధానం : జార్జ్ వాషింగ్టన్

9. అమెరికాలోని రెండు అతి పొడవైన నదుల పేర్లు?

సమాధానం : మిస్సిస్సిప్పి, మిస్సోరీ

 

10.రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎవరిపై యుద్ధం చేసింది? 

సమాధానం : జర్మనీ, జపాన్, ఇటలీ.

 
 
 
 
 
 
 
 
 

 

Loading...