:: Welcome to NRI - Article ::

పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేసుకోండిలా..

విదేశాల్లో ఉండాలంటే పాస్‌పోర్ట్‌ అనేది తప్పనిసరి. అయితే ఒకసారి జారీ చేసిన పాస్‌పోర్టు పది సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత కూడా విదేశాల్లో ఉండాలంటే కనీసం సంవత్సరం ముందే కొత్త పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేసుకోవాలి. అయితే ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేసుకోలేరు. అంతకంటే ఎక్కవకాలం ఉండాలంటే కచ్చితంగా కొత్త పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకు ఫీజు ఉండదు. పాస్‌పోర్టు గడువు ముగిసిన తర్వాత కూడా విదేశాల్లోనే ఉంటే అక్కడి చట్టరీత్యా నేరం. వారిపై క్రిమినల్‌ కేసులు కూడా పెడతారు. అందుకే ముందుగా మేలుకుంటే ఎటువంటి బాధా ఉండదు. పాస్‌పోర్టుపైనే దాని గడువు తారీఖు ఉంటుంది. 
 
పాస్‌పోర్టు రెన్యూవల్‌ చేసుకోవడానికి దరఖాస్తు విధానం: 
 
1.http://passport.gov.in/nri/Online.do లింక్‌ ఓపెన్‌ చేసి సర్వీస్‌ డిజైర్డ్‌ ఉన్న చోట ఫ్రెష్‌ అప్లికేషన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 
2. ఆ తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో అడిగిన వివరాలను పూర్తి చేయాలి. 
3. పూర్తి చేసిన దరఖాస్తు కాపీని తీసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంబసీ/ కాన్సులేట్‌ కార్యాలయాల్లో సమర్పించాలి.
4. దరఖాస్తును పరిశీలించిన అధికారులు అన్నీ కరెక్ట్‌గా ఉంటే పర్సనల్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. పాస్‌పోర్టు ఇవ్వడంపై నిర్ణయాధికారం పూర్తిగా కాన్సులేట్‌ అధికారులదే.
 
కావాలసిన పత్రాలు:
1. ఇంతకుముందు ఉన్న పాస్‌పోర్టు కాపీ
2. రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు
3. జన్మ ధృవీకరణ పత్రం, డ్రైవింగ్‌ లైసెన్స్‌
4. ప్రస్తుతం ఉంటున్న చిరునామా ధృవీకరణకు కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లు, టెలిఫోన్‌ బిల్లు.
5. ఉండటానికి కారణాలను చూపే ధృవీకరణ పత్రాలు (చేస్తున్న ఉద్యోగో వివరాలు, విద్యార్థి అయితే ఎడ్యుకేషన్‌ వివరాలు)
అయితే కొత్తగా పాస్‌పోర్టు పొందిన తర్వాత పాత పాస్‌పోర్టును ఎంబసీలో సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ఏకకాలంలో రెండు పాస్‌పోర్టులను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం.
 

 

Loading...