వీసా ఉన్నా ఈ 5 ప్రాంతాలకు వెళ్లలేరు

ఆంధ్రజ్యోతి:అక్కడికి వెళ్లడానికి దారులున్నాయి. వాహనాలూ ఉన్నాయి. కానీ అందులోకి అందరూ ప్రవేశించరాదు. అపాయం.. అని రాసి ఉన్న ప్రదేశాలకు వెళ్లడం సబబు కాదు. కానీ డేంజర్‌ అనే సైన్‌ బోర్డు లేకున్నా.. ఆ గేటుల్లోకి నో ఎంట్రీ ఎందుకో తెలుసుకుందాం..

 
మన దేశంలో ఏ ప్రదేశానికైనా హాయిగా వెళ్లొచ్చు. కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్టు కావాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాలకు వీసా కూడా అవసరం ఉండదు. కానీ ఓ ఐదు మిస్టీరియస్‌ ప్రదేశాలకు వెళ్లాలంటే మాత్రం కొన్ని నిబంధనలున్నాయి. ప్రపంచంలో ‘నో గో ప్లేసెస్‌గా’గా ప్రసిద్ధి చెందిన అవే.. రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మెన్‌విత్ హిల్‌(ఇంగ్లాండ్‌), వాటికన్‌ సీక్రెట్‌ ఆర్చివ్స్‌(వాటికన్‌సిటీ), ద స్వాల్‌బర్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌(నార్వేయన్‌ ఐలాండ్‌), నిహౌ (హవాయి ద్వీపం), ఏరియా 51(నెవాడ).
 
విత్తన బ్యాంకు లొకేషన్‌: 
నార్వే ద్వీపం, స్పిట్స్‌బర్గెన్‌లో ఉన్న సాండ్‌స్టోన్‌ పర్వతంలో ‘ద స్వాల్‌బర్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌’ ఉంది. నార్త్‌పోల్‌ నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ప్రపంచంలోనే హై సెక్యూరిటీ సీడ్‌ బ్యాంకుగా ఇది ప్రసిద్ధి చెందింది. 2008 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించారు. 
ఎలా: ప్రత్యేక ప్యాకింగ్‌లో అన్ని వాతావరణాలకు తట్టుకోనేలా వీటిని నిల్వచేశారు. హీట్‌ సీల్డ్‌ ప్యాకెట్లతో ఉంచిన ఈ విత్తనాలు ఎంతో సురక్షితంగా ఉంటాయి. 
ఈ ప్రదేశంలోనే ఎందుకు? 
ఈ ప్రదేశం సముద్ర ఉపరితలానికి దాదాపు 130 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ భూకంపాలు సంభవించవు. భూతాప ప్రభావం ఉండదు. మంచుతో కప్పి ఉన్న భూమి పొర ఉండటం వల్ల విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. భూతాపం వల్ల ధృవప్రాంతాలు కరిగిపోయినా ఈ బ్యాంకులో ఉన్న విత్తనాలకు ఎటువంటి నష్టం వాటిల్లదు. పర్వతాన్ని తొలిచి 120 మీటర్ల లోతులో విత్తనాలను భద్రం చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల.. ఏ పంటకు సంబంధించిన విత్తనమంతా పోయినా మళ్లీ ఇక్కడ నుంచి సేకరించవచ్చు. 
ఎవరు వెళ్లొచ్చు? 

ప్లాంట్‌ బ్రీడర్‌ లేదా విత్తన సంక్షేమం కోసం నియమించిన ప్రత్యేక పరిశోధకుడు.

రహస్య పత్రాలు 

లొకేషన్‌: వాటికన్‌ నగరంలో ఉన్న ‘వాటికన్‌ సీక్రెట్‌ ఆర్కైవ్స్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ లైబ్రరీ.  ఎనిమిదో శతాబ్దానికి చెందిన ‘పోపు’ల వ్యకిగత పత్రాలు ఇక్కడ భద్రపరిచారు. 

 ఈ రహస్య పత్రాలను లాకర్లలో భద్రంగా ఉంచుతారు.  ఇందులో దాదాపు 35,000 పత్రాలుఉన్నాయి. 
ఎవరు ప్రవేశించవచ్చు 
క్వాలిఫైట్‌ స్కాలర్స్‌ను మాత్రమే ఇందులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. వాళ్లు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారంతో పాటు, పరిశోధన ఉద్దేశం, పరిశోధన సంస్థ నుంచి రికమండేషన్‌ లెటల్‌ నిర్వహకులకు ఇస్తే వాళ్లు అవన్నీ పరిశీలించి.. లోపలికి వెళ్లేందుకు గాను ఓ గుర్తింపు కార్డును ఇస్తారు.
 

లోకల్‌ ఇన్విటేషన్‌

లొకేషన్‌: హావాయి ద్వీపంలోని ఓ చిన్న ప్రాంతం నిహౌ. హావాయి రాజు ఈ ప్రదేశాన్ని 1863లో ఓ కుటుంబానికి అమ్మేశారు. 1915 నుంచి ఇక్కడికి వేరే ప్రాంతవాసులు(ఔట్‌సైడర్స్‌) రాకూడదని నిహౌ ప్రజలు నిబంధన పెట్టారు. 1944లో యూఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంక్లిన్‌ డి రూజ్వెల్ట్‌ నిహౌను యూఎన్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా ప్రకటించాడు. 

 జనాభా: ప్రస్తుతం ఇక్కడ 130 మంది మాత్రమే నివాసముంటున్నారు. ఇక్కడ ఇళ్లకు అద్దె ఉండదు, రోడ్డు, ఫోను సౌకర్యాలు లేవు. ప్రవహించే నీరు కూడా ఉండదు. చదువుకోవాలంటే దగ్గరలోని మరో ద్వీపానికి వెళతారు.

 
అనుమతి ఎవరికి? 
స్థానికులు అహ్వానించిన వారే నిహౌలోకి అడుగుపెట్టవచ్చు. నిహౌను ‘ఫర్‌బిడెన్‌ ఐలాండ్‌’గా పిలుస్తుంటారు.
 

అంతా రహస్యమే

 లొకేషన్‌: లాస్‌వేగాస్‌కు 130 కిలోమీటర్ల దూరంలోనే ‘ఏరియా 51‘ ఉంది. మిలటరీ, ఎయిర్‌ఫీల్డ్‌లకు సంబంధించిన రహస్య పనులు ఇక్కడ జరుగుతాయిట. 

ఇక్కడ ఏం జరుగుతుంది? 
ఇందులో ఏం జరుగుతుందో కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు. క్రాషై పడిపోయిన ఎయిర్‌క్రా్‌ఫ్టల లోపాలను తెలుసుకునేందుకు, కొత్త రకమైన విమానాలకు పరీక్షలు చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు. ఆయుధ వ్యవస్థలను ప్రయోగాత్మకంగా ఇక్కడ పరీక్షించడంతో పాటు, వాటిని అభివృద్ధి చేయడం ఈ సైనిక స్థావర ప్రధానం ఉద్దేశం.
 
హు ఎంటర్స్‌: ఇతరులను ఎవరినీ ఇందులోకి అనుమతించరు.
 

స్పై నెట్‌ వర్క్‌ 

లొకేషన్‌: ఇంగ్లాండ్‌, న్యూయార్క్‌షైర్‌లో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మెన్‌విత హిల్‌ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ర్టానిక్‌ మానిటరింగ్‌ స్టేషన్‌. దీన్ని అమెరికా 1954లో నిర్మించింది. యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌(యూఎస్‌ఎ్‌సఆర్‌) కోల్డ్‌వార్‌ గురించి మాట్లాడే మాటలను రహస్యంగా వినడానికి దీన్ని అమెరికా ప్రారంభించింది. అంతేకాకుండా అంతర్జాతీయ ఉగ్రవాదులు, డ్రగ్‌ వ్యాపారుల కార్యకలాపాలపై నిఘా వేసేందుకు కూడా ఈ కమ్యూనికేషన్‌ను ఉపయోగించుకున్నారు. ‘గ్లోబల్‌ స్పై నెట్‌వర్క్‌’లో భాగంగా దీన్ని వాడుతున్నారు. ఆస్ర్టేలియా, కెనడా, న్యూజిలాండ్‌, యూకే, యూఎస్‌ ఈ ఐదు దేశాలు సభ్యులుగా ఉన్న దీనికి ‘ఎక్లాన్‌(ఉఇఏఉఔౖూ)గా పేరుపెట్టుకున్నాయి.

 
ఎంట్రీ 
యూఎస్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సభ్యులతో పాటు ఎక్లాన్‌ సభ్యదేశాల వాళ్లకు ఇందులోకి ప్రవేశం ఉంటుంది.