:: Welcome to NRI - Article ::

పాస్‌పోర్ట్‌ పోయిందా..

విదేశాల్లో ఉండేటప్పుడు డబ్బు దొంగతనానికి గురయినా కలగని బాధ... పాస్‌పోర్ట్‌, వీసా వంటి కార్డులు పోతే కలుగుతుంది. అవి లేకుంటే పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక జైలు పాలవ్వాల్సి వస్తుంది. పాస్‌పోర్టును ఎవరయినా దొంగిలించినా, పోయినా, పాడయిపోయినా వెంటనే మరో పాస్‌పోర్టును పొందడం ఉత్తమం. అయితే పాస్‌పోర్టు లేకుండా విదేశాల్లో ఉండటం నేరం కాబట్టి కొత్త పాస్‌పోర్టు వచ్చేలోపు డూప్లికేట్‌ పాస్‌పోర్టు తీసుకోవాలి. ఎంబసీ అధికారులు మెయిల్‌ సర్వీసు ద్వారా డూప్లికేట్‌ పాస్‌పోర్టు ఇవ్వరు. ఒక వేళ ఎంబసీకి చాలా దూర ప్రదేశంలో ఉన్నట్లయితే నోటరీ అధికారి ముందు దరఖాస్తు పత్రంపై ఫోటో, సంతకం చేసి.. ‘నా ముందే ఈ అభ్యర్థి సంతకం చేశారు’ నోటరీ అధికారితో సర్టిఫికెట్‌ పొందాలి. 

 
జత చేయవలసిన పత్రాలు:
1. పాస్‌పోర్టు పోయిన ప్రదేశం వివరాలు, పాస్‌పోర్టు కాపీ
2. ఇద్దరు ఎన్నారైల గెజిటెడ్‌ సంతకంతోపాటు వారి పాస్‌పోర్టు కాపీలు
3. ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిరునామా వివరాలు.. సంబంధిత పత్రాలు
4. జన్మ ధృవీకరణ పత్రం
5. రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు
 
వీటిని మెయిల్‌ ద్వారాగానీ, నేరుగాగానీ ఎంబసీలో సమర్పిస్తే డూప్లికేట్‌ పాస్‌పోర్టు ఇస్తారు. డూప్లికేట్‌ పాస్‌పోర్టునుగానీ, ఓరిజినల్‌ పాస్‌పోర్టునుగానీ రెండోసారి పోగొట్టుకుంటే మళ్లీ డూప్లికేట్‌ పాస్‌పోర్టు ఇవ్వరు. వారిపై పోలీస్‌ ఎంక్వయిరీ వేస్తారు. డూప్లికేట్‌ పాస్‌పోర్టు తీసుకున్న తర్వాత ఒరిజినల్‌ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలి.