Get-your-passport-by-this-way

పాస్‌పోర్ట్ పొందండిలా..

ఆన్‌లైన్‌లో సులువుగా దరఖాస్తు

అనంతలో ప్రాంతీయ సేవాకేంద్రం
సాధారణ కాలపరిమితి నెలరోజులు
తత్కాల్‌ అనుమతి వారంలోపే...

మన దేశం నుంచి ఇతర ఏ దేశంలో కాలు పెట్టాలన్నా పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. ఇది లేకుండా విదేశాలకు వెళ్లడం అసాధ్యం. అంత ముఖ్యమైన పాస్‌పోర్ట్‌ను పొందాలంటే...గతంలో పలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ కష్టాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రామీణ ప్రాంతాలకు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగరంలోనూ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. దరఖాస్తు విధానం..తదితర వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
 
విదేశాల్లో చదువుకోవాలన్నా...జీమ్యాట్‌ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవాల న్నా పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. వీటిని పొందడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు పాస్‌పోర్ట్‌ కోసం చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగానే అనంతపురం నగరంలోని స్థానిక ట వర్‌క్లాక్‌, ప్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఉన్న తపా లా ప్రధాన కార్యాలయంలో పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేస్తుంది. ఏమైనా ఫిర్యాదులు చేయాలంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 18002581800 ను సంప్రదించాలి.
 
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
పాస్‌పోర్ట్‌ కావాలనుకునే వారు రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి ఆన్‌లైన్‌ ద్వారా, రెండోది దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని పెన్నుతో పూర్తిచేసి మళ్లీ దాన్ని అప్‌లోడ్‌ చేసి పంపిం చే విధానం. ప్రస్తుతం అధికంగా ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఇంటర్‌నెట్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌పై పూర్తి పరిజ్ఞానం ఉన్నట్లయితే ఇంటి నుంచి కూడా దరఖాస్తు నింపి ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. వెబ్‌సైట్‌.... www.passportindia.gov.in లో లాగినై దరఖాస్తు చేసుకోవాలి. అందులో హోంపేజీలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేసి అడిగిన సమాచారాన్ని నింపి సబ్‌మిట్‌ చేయాలి. కొత్తగా వచ్చే యూజర్‌ ఐడీతో కొత్త, రెన్యువల్‌ పాస్‌పోర్ట్‌లో ఏది కావాలంటే ఆ దరఖాస్తు నింపాలి. సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌చేసి, అప్‌లోడ్‌ చేయాలి. లేదా ఈ ఫారంను డౌన్‌లోడ్‌ చేసి దరఖాస్తును పూరించి అప్‌లోడ్‌ చేయవచ్చు. దరఖా స్తు రెఫరెన్స్‌ నంబర్‌ను తీసుకోవాలి. అపాయింట్‌మెంట్‌ ఖరారు చేసుకుని ఆ పత్రాన్ని ప్రింట్‌ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఈ విధానం అంతా స్లాట్‌బుకింగ్‌ అంటారు. మొత్తం తొమ్మిది పద్దతు ల్లో ఈ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఈ స్లాట్‌బుకింగ్‌ చేసిన దరఖాస్తులను సేవాకేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు పరిశీలిస్తారు. ఆ తర్వాత మీరు ఎప్పుడు పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి రావాలో నిర్దేశించిన తేదీని తెలియజేస్తారు. మీరు ఇచ్చిన సెల్‌నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఈ సమాచారం వస్తుంది. ఆ రోజు విధిగా పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రానికి వె ళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించినప్పుడు చేసిన ప్రింట్‌తో పాటు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, రసీదుతో సహా హాజరుకావాల్సి ఉంటుంది.
 
ఏయే వర్గాల వారికి ఎలా..?
చదువుకునన్న వారైతే పాస్‌పోర్ట్‌కు ప దోతరగతి మార్కుల జా బితా, ఆధార్‌కార్డు లేదా గుర్తింపు కార్డు ల్లో ఏదో ఒకటి చిరునామా కోసం దరఖాస్తులో ఉండాలి. ఏ మాత్రం చదువుకోని వారు ఆధార్‌కార్డుతో పాటు పాన్‌కార్డును జతచేయాల్సి ఉంటుంది.
- ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు పాస్‌పోర్ట్‌ పొందాలంటే ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితాతో పాటు ఆధార్‌నంబర్‌, ఎం ప్లాయి గుర్తింపు కార్డు, సంబంధిత శాఖ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఎనగ్జర్‌-హెచ్‌ను డౌన్‌లోడ్‌ చేసి డ్రాయింగ్‌ అధికారితో సంతకం చేయించాల్సి ఉంటుంది. నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది.
- పదోతరగతి లేని నిరుద్యోగులు సర్వీ్‌సబుక్‌లో నమోదైన వివరాలను జిరాక్స్‌ రూపంలో జతచేయాలి.
- దరఖాస్తు సమర్పణలో సందేహాలుంటే సుమారు 37 భాషల్లో 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ 18002581800, 08 554-278333లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. 
- పాస్‌పోర్ట్‌ను కేవలం పదేళ్ల వ్యవధికి మాత్రమే ఇస్తారు. ఆ గ డువు పూర్తయ్యాక మళ్లీ పదేళ్ల కాలానికి రెన్యువల్‌ చేస్తారు. 
- సాధారణ పోస్ట్‌పోర్ట్‌ నీలం రంగులోనూ, డిప్లమాట్‌... అంటే జ డ్జీలు, రాజ్యాంగ పదవుల్లో ఉండే సీఎం, పీఎం, ఎంపీలకు మెరూన్‌ రంగులో, అధికారిక పనులు కోసం వెళ్లే వారికి బూడిదరంగులోనూ పాస్‌పార్ట్‌ అందజేస్తారు.
 
ఫీజులు ఇలా...
సాధారణ పాస్‌పోర్ట్‌...
26 పేజీలు - రూ.1500
సాధారణ పాస్‌పోర్ట్‌...
80 పేజీలు - రూ.2000
తత్కాల్‌ పద్ధతి ద్వారా...
26 పేజీలు - రూ.3500
తత్కాల్‌ పద్ధతి ద్వారా ...
80 పేజీలు- రూ.4000
ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ కోసం....  రూ.30
 
సేవా కేంద్రం వద్ద చేయాల్సినవి...
ఒకటో కౌంటర్‌ వద్ద ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. రెండో కౌంటర్‌ వద్ద ఏ-1-38 మీ డాక్యుమెంట్లను ఆప్‌లోడ్‌ చేస్తారు. ఫొటోలు తీసి, చేతివేళ్ల ప్రింట్లను తీసుకుంటారు. తర్వాత మూడో కౌంటర్‌లో మరోమారు మీ దరఖాస్తు పరిశీలిస్తారు. తర్వాత దరఖాస్తును జిల్లా పోలీస్‌ అధికారి కార్యాలయానికి పరిశీలనకు పంపిస్తారు. మీ వ్యక్తిగత వివరాలను పోలీస్‌ అధికారులు విచారించి నివేదిక అందించిన తరవ్వాత మీకు పాస్‌పోర్ట్‌ను మంజూరు చేస్తారు. సాధారణ దరఖాస్తు అయితే మూడు వారాల్లో, తత్కాల్‌ విధానంలో అయితే వారంలోపే జారీచేస్తారు.
 
ధ్రువపత్రాలు స్పష్టంగా అందజేయాలి
పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసిన వారు విధిగా ధ్రువీకరణ పత్రాలను, పొటోలను స్పష్టంగా అందజేయాలి. లేకుంటే పాస్‌పోర్ట్‌ తిరస్కరించే అవకాశం ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. కాబట్టి ఏదైనా సమస్య, అనుమానం వచ్చినప్పుడు ఇమిగ్రేషన్‌ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. స్పష్టమైన ఽధ్రువీకరణ పత్రాలు లేకుంటే వీసాను తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ స్పష్టంగా ఉండే పత్రాలను మాత్రమే సమర్పిస్తే బాగుంటుంది. తత్కాల్‌ కింద మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌ అందజేస్తాం. పాస్‌పోర్ట్‌ అందజేసిన తరువాత పోలీస్‌ విచారణ చేపడతాం. విచారణలో నేరాలు ఉన్నట్లు తేలితే సంబంధిత వ్యక్తి పాస్‌పోర్ట్‌ రద్దు చేయడంతో పాటు రెండేళ్ల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా ఉంటుంది.
ఎన్‌ఎల్‌ ప్రసాద్‌చౌదరి, 
రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌