easy-way-to-get-passport---

పాస్‌పోర్ట్‌ ఇక ఈజీ.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే..!

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే
ఒకప్పుడు పాస్‌పోర్టు తీసుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. కార్యాలయాల చుట్టూ తిరగాలి. అధికారుల సంతకాలు తీసుకోవాలి. ఆపై పాస్‌పోర్టు చేతికి రావడానికి ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో దళారుల బెడదా ఉంటోంది. ఇకపై ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. నెల రోజుల్లో మీ ఇంటికే పాస్‌పోర్టు వచ్చేస్తుంది. అత్యవసరంగా కావాలనుకుంటే తత్కాల్‌ విధానం కూడా ఉంది.
 
విజయవాడ: విదేశాలకు విహారయా త్రలకు, చదువుకోవడానికి, పనులకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వీ రందరికీ పాస్‌పోర్టు అవసరం. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగప్రవేశం చేస్తుండ టంతో ప్రభుత్వం నూతన విధానాన్ని అమ ల్లోకి తీసుకొచ్చింది. జనం దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా నేరుగా తామే నిబంధనలను అనుసరించి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే గతంలో జిల్లావాసు లంతా పాస్‌పోర్ట్‌ కోసం తిరుపతిలోని సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ ఏడాది మే నుంచి చిత్తూరు హెడ్‌ పోస్టాఫీసులోనూ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి ఇదివరకటిలా పాస్‌పోర్టు కోసం అధిక సమయం, డబ్బు వృథా చేసుకోకుండా పాస్‌పోర్టును సులభంగా పొందవచ్చు.
 
ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాతే..
పాస్‌పోర్టు కావాల్సిన వారు నేరుగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముం దుగా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు కార్యాలయానికి వెళ్లాలో సమాచారం తెలుస్తుంది. ఆ రోజున చిత్తూరు/తిరుపతి పాస్‌పోర్టు సేవా కార్యాలయాలకు వెళ్తే ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. పత్రాలన్నీ సరిగా ఉంటే నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే పాస్‌పోర్టును పంపుతారు.
 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానమిలా..
www.passport.india.gov.in  ఓపెన్‌ చే సి.. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చే సుకోవాలి. దరఖాస్తులో పేర్కొన్న 36కాలాల్లో అభ్యర్థి వివరాలను పొందుపర చాలి. అలాగే దరఖాస్తు రుసుమును నెట్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. స్టేట్‌బ్యాంక్‌ అనుబంధ శాఖలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. పెద్దలు, మైనర్లు, వయోవృద్ధులు ఇలా మూడు రకాల పాస్‌పోర్టు లుంటాయి. సాధారణ పద్ధతిలో పాస్‌పోర్టు పొందడానికి రూ.1,500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానంలో పాస్‌పోర్టు తీసుకోడానికి అధిక సమయం పడుతుంది. పోలీసుశాఖ త నిఖీ అనంతరం ఇంటర్నెట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. వారు నిర్ణయించిన తేదీనాటికి తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత అధికారిని నేరుగా కలవాలి. పత్రాలను పరిశీలించిన అధికారులు సంతృప్తి చెందితేనే పాస్‌పోర్టు చేతికందుతుంది. ఈ పద్ధతిలో పాస్‌పోర్టు కావాలంటే నెలరోజులైనా సమయం పట్టే అవకాశం ఉంది.
 
అత్యవసరంగా కావాలంటే.. : అత్యవసరంగా పాస్‌పోర్టు కావాలంటే తత్కాల్‌ పద్ధతి అమల్లో ఉంది. ఇందుకోసం దరఖాస్తు రు సుం రూ.3,500 చెల్లించాలి. ఈ విధానంలో ఏడు, పనిదినాల్లోనే పాస్‌పోర్టు మన చేతికి వస్తుంది. ఇందుకోసం ముందుగా ఎస్పీకి లిఖితపూర్వకంగా లేఖరాసి, అనుమతి పొందాక అక్కడినుంచి స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగానికి వె ళ్లాలి. ఈ విభాగం వారికి ఆరు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. అభ్యర్థి నివసించే ప్రాంతంలోని ఎక్సైజ్‌, విద్యుత్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫారెస్ట్‌, పోలీస్ స్టేషన్‌ నుంచి గెజిటెడ్‌ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను స్పెషల్‌ బ్రాంచ్‌కు సమర్పించాలి. ఇవన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎస్పీకి నివేదిస్తారు. ఆ తర్వాత సీల్డు కవర్‌లో అభ్యర్థికి అనుమతి పత్రాన్ని అందజేస్తారు. దీనిని పాస్‌పోర్టు కార్యాలయంలోకి అధికారికి ఇస్తే తత్కాల్‌ పద్ధతిలో పాస్‌పోర్టు మంజూరవుతుంది.
 
అవసరమయ్యే ధ్రువపత్రాలు
- మైనర్లకు ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈసీఆర్‌ ధ్రువీకరణపత్రం తప్పనిసరి
- ప్రైవేటు ఉద్యోగి అయితే కంపెనీ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
- పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పని సరి. లేనివారు అఫిడవిట్‌ సమర్పించాలి.
- బ్యాంక్‌ పాస్‌పుస్తకం, కరెంటు బిల్లు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డులు సమర్పించాలి.
 
సమాచారం కోసం
నేషనల్‌ కాల్‌ సెంటర్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-258-1800 ద్వారా పాస్‌పోర్టుకు సం బంధించిన వివ రాలన్నీ పూర్తిగా తెలుసుకోవ చ్చు. దాంతోపాటు వెబ్‌సైట్‌లో పాస్‌పోర్టు స్టేటస్‌ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది.