‘గల్ఫ్‌’ వలసలకు కుదుపు... దుబాయికి ఇక బై..బై

 ‘గల్ఫ్‌’ వలసలకు కుదుపు...

    దుబాయికి ఇక బై..బై
    ఎక్కిరిస్తున్న ఎడారి దేశం
    ఉపాధికి ‘ కండక్ట్‌ ’ తప్పనిసరి
    వర్క్‌ వీసాదారులందరికీ వర్తింపు
    టూరిస్టు వీసాలకు మినహాయింపు
    కేసులు, నేరారోపణలున్నవారికి షాక్‌
    ఇకపై ఎంబసీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే

దుబాయి దేశం ఓ తాజా నిబంధనను అమలు చేయబోతోంది. ఇప్పటికే కువైట్‌ అమలు చేస్తోంది. ఈ నిబంధన గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లాలని భావిస్తున్న వారి గుండెల్లో గుణపంగా మారింది. ఇక నుంచి తమ దేశానికి ఉద్యోగాలు, కూలీ పనుల కోసం వచ్చే వారంతా తప్పనిసరిగా ‘ కండక్ట్‌ ’ ( సత్ప్రవర్తన ) సర్టిఫికెట్‌ను సమర్పించాలని దుబాయి దేశం జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమపై ఎలాంటి పోలీసు, న్యాయ పరమైన కేసులు లేవని, అలాగే ఇప్పటి వరకు తమకు ఎలాంటి శిక్షలు పడలేదని, నేరారోపణలు సైతం లేవంటూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌ల నుంచి కండక్ట్‌ సర్టిఫికెట్‌ తీసుకుని వీసాతో పాటు ఎంబసీ కార్యాలయంలో సమర్పించాలి.
 
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్తున్న వారందరికి అక్కడి ప్రభుత్వాలు చుక్క లు చూపుతున్నాయంటున్నారు. ఇప్పటికే అనేక నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎడారి దేశాలు మరోసారి ఓ తాజా ని బంధనను అమలులోకి తెచ్చేందులకు సిద్ధం అవుతుందంటున్నారు. ముఖ్యంగా యూఏఈలోని దుబాయి దేశం ఈ తాజా నిబంధనను అమలు చేయబోతుండడం సర్వత్రా ఆందోళనకు కారణం అవుతుంది. ఇప్పటికే కువైట్‌ అమలు చేస్తుండగా తా జాగా దుబాయి దానిని తెరపైకి తే బోతుండడం గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లాలని భావిస్తున్న వారి గుండెల్లో గుణపంగా మారింది. ఇక నుంచి తమ దేశానికి ఉద్యోగాలు, కూలీ పనుల కోసం వచ్చే వారంతా తప్పనిసరిగా ‘కండక్ట్‌’ (సత్ప్రవర్తన) సర్టిఫికెట్‌ను సమర్పించాలని దుబాయి దేశం జారీ చేసి న ఆదేశాలు కలకలం రేపుతుందంటున్నారు.
 
తమపై ఎలాంటి పోలీసు, న్యాయ పరమైన కేసులు లేవని, అలాగే ఇప్పటి వర కు తమకు ఎలాంటి శిక్షలు పడలేదని, నేరారోపణలు సైతం లే వంటూ సంబంధిత పోలీ్‌సస్టేషన్‌ల నుంచి కండక్ట్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ను తమ వీసాతో పాటు ఎంబసీ కార్యాలయంలో సమర్పించాలని అక్కడి నుంచి దు బాయి దేశ ఎంబసీ అధికారులు దీనిని నిర్దారించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే దుబాయి దేశం వీరికి ఉపాధిపై స్పష్టతనివ్వనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నిబందనను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఆ దేశం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న గ్రా మీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఇక దుబాయి దేశానికి ఉ పాధి కోసం వెళ్లడం కుదురకపోవచ్చని పేర్కొంటున్నారు.
 
 కొత్త నిబంధనపై ఆందోళన
స్వేచ్ఛగా, ఎక్కువగా ఉపాధి అవకాశాలున్న దుబాయి దేశం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లాలోని గ్రామీణ ప్రాంతా ల నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు. దుబాయి దేశం జారీ చేసిన కండక్ట్‌ సర్టిఫఫికెట్‌ నిబందన కా రణంగా తాము ఇక గల్ప్‌ దేశాలపై ఆశలు కోల్పోవలసి వస్తుందంటున్నారు. సొంత ఊరులో ఉద్యోగావకాశాలు దొరకక పో తుండడంతో అందరిలాగే తాము దుబాయి దేశానికి ఉద్యోగం కోసం వెళ్ళ్లాలని భావిస్తున్న తరుణంలో ఆ దేశం కఠిన నిబంధన విధించడం శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 కండక్ట్‌ సర్టిఫికెట్‌ జారీకి ఆటంకాలు
కండక్ట్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం పోలీసు శాఖకు ఉండడంతో ఆ శాఖ ద్వారా సర్టిఫికెట్‌ పొందడం ఎంతో కష్టత రం అంటున్నారు. పోలీసులు తమ వద్ద ఉన్న అన్ని రకాల రి కార్డులను పరిశీలించిన త ర్వాతనే ఈ సర్టిఫికెట్‌ను జారీ చే యాల్సి ఉంటుంది. అయితే రికార్డులు సక్రమంగా ఉన్నప్పటికీ పోలీసులు ఈ సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు ఉద్ధేశ పూర్వకంగా ఎన్నో ఇబ్బందులు సృష్టించవచ్చంటున్నారు. అయితే పోలీసు శాఖ ద్వారా సర్టిఫికెట్‌ పొందినప్పటికి ఆ సర్టిఫికెట్‌ను మళ్లీ ఎంబసీ కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరుగాలంటే నెలలు గడిచిపోవచ్చంటున్నారు. అమాయకులు ఈ సర్టిఫికెట్‌ను పొందేందుకే కాకుండా ధ్రువీకరించుకునేందుకు తిరిగితిరిగి అలసిపోయి ఇక దుబాయి వెళ్లాలనే యోచనను విరమించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నదంటున్నారు.
 
 వర్క్‌ వీసాదారులకు మాత్రమే..
కండక్ట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అనే నిబంధనను కేవలం వర్క్‌ వీసాపై వెళ్లే వారికి మాత్రమే విధించనున్నారు. విజిట్‌ వీసాలపై వెళ్లే వారికి ఈ సర్టిఫికెట్‌ అవసరం ఉండబోదంటున్నారు. దుబాయి దేశం తమ అంతరంగిక భద్రతా కారణాల దృష్యా నేర చరితులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఈ నిబంధనను తెరపైకి తె చ్చిందంటున్నారు. అయితే ఇది మన నిర్మల్‌ జిల్లా అమాయకులకు నష్టం కలిగే అవకాశాలున్నాయంటున్నారు.
 
 ఫిబ్రవరి నాలుగు నుంచి అమలు
దుబాయికి ఉపాధి వీసాపై వెళ్లే వారందరు ఫిబ్రవరి నాల్గవ తేదీ నుంచి కండక్ట్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్చించాల్సి ఉంటుందంటున్నారు. ఇక నుంచి కండక్ట్‌ సర్టిఫికెట్‌ లేకుండా ఎట్టీ పరిస్థితితుల్లోననూ దుబాయి వెళ్లలేని పరిస్థితి నెలకొనబోతుంది. ప్రస్తుతం దుబాయి దేశంలో భారతీయులే కాకుండా, ఇతర వెనుకబడిన, అబివృద్ధి చెందుతున్న దేశాల యువకులు పెద్దసంఖ్యలో ఉన్నారు. అలాగే ప్రతి యేటా బారీ సంఖ్యలో దుబాయికి వెళ్లేందుకు చాలా మంది యువకులు ఉత్సాహం చూపుతుండడమే కాకుండా పెద్ద మొత్తంలో ఏజెంట్లకు డబ్బులు సైతం చెల్లిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మొత్తానికి దుబాయి జారీ చేసిన కండక్ట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి ఆదేశాలు నిర్మల్‌ జిల్లాలోని నిరుద్యోగుల వలసలకు కలిగించబోనున్నదంటున్నారు.