ఖండాంతరాల్లో పిల్లలు.. కుమిలిపోతున్న తల్లిదండ్రులు

స్వదేశానికి రాలేకపోతున్న పిల్లలు
నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులు
 
పిల్లల భవిష్యత్తే.. తమ భవిష్యత్‌గా భావించి ఎన్నో వ్యయప్రాయాసలనోర్చి ఉన్నదంతా ఊడ్చి తల్లిదండ్రు లు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఉద్యోగరీత్యా వారు విదేశాలకు వెళ్తున్నప్పుడు మొదట్లో సంతోషించిన వారే చివరకు మదనపడుతున్నారు. చరమాంకంలో పిల్లలు, మనుమలు, మనవళ్ల కోసం వారు పడుతున్న ఆరాటం, కోరుకుంటున్న తోడు  పలువురిని కలచివేస్తోంది. విదేశాలకు వెళ్లిన వారి  తల్లి దండ్రుల కన్నీటి వ్యథపై ప్రత్యేక కథనం..

తల్లిదండ్రులందరూ తమ పిల్లల భవిష్యతే లక్ష్యంగా తాము పస్తులుండి పిల్లల కడుపు నింపుతున్నారు. తాము పడే కష్టాలు వారికి రాకూడదని పైసా పైసా కూడబెట్టి పిల్లల ఉన్నతికి ఖర్చు చేస్తున్నారు. తమ స్థాయిని మరిచి ఉన్నదంతా అమ్మి అప్పులు చేసి పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల్లో ఖండాంతరాల్లో పిల్లల భవిష్యత్‌ను చూడాలన్న వారి కలలు నిజమైనప్పటికీ చివరికి అదే శాపంగా మారుతోంది. అవసాన దశలో పిల్లలు అండగా ఉండాలని వారిలో చేతిలో హాయుగా కన్ను మూయలనుకునే వారి కల లు కలలుగానే మిగిలిపోతున్నాయి. 

వయస్సు మళ్లిన శరీరం సహకరించకపోవడంతో వృద్ధాప్యంలో ఓదార్పు, ఆత్మసైర్థ్యాన్ని ఇచ్చే వారు కరువై మథనపడుతున్నారు. దీంతో కడుపున పుట్టిన వారు ఖండాంతరా లు దాటి బతుకుతున్నారని సంతోషించాలో... కళ్ల ముందు లేకుండా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారని బాధపడారో తెలియని పరిస్థితి. వీడియో కాలింగ్‌, వాట్సాప్‌, మెసేంజర్‌ చాటింగ్‌లోనూ కళ్లముందు కనిపిస్తూ రోజు వారీగా మాట్లాడుతున్న పిల్లలు కళ్ల ముందు లేక ఎందరో తల్లిదండ్రులు మదనపడుతున్నారు. విదేశాల్లో ఉన్న వారిలో చాలామంది పని ఒత్తిడితోనో లేక పనుల్లో అనుకూలత లేమి ఇతరత్రా కారణాలేమైనా స్వదేశానికి రాలేకపోతున్నారు. 
 
ఆలనాపాలనా కరువు..
చేవచచ్చి.. వయస్సు మళ్లిన కొందరు తల్లిదండ్రులు జీవ న చరమాంకంలో కన్నవారి ఆలనాపాలనకు నోచుకో వట్లే దు. కన్నకష్టాలు పడి పిల్లలను చదివించి ప్రయోజకులను చేసినా ఆదుకోవాల్సిన సమయంలో పక్కన లేక అనేక ప్ర యాసాలకు లోనవుతున్నారు. జీవన చరమాంకంలో ఒం టరిగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులే కాదు, స్థానికంగా నగర ప్రాంతాల్లో ఉండే వారి తల్లిదండ్రుల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళ్లే వెసులుబాటు వీరికి ఉండగా, విదేశాల్లో ఉండే వారికి ఈ వెసులుబాటు సైతం లేదు.
 
ఆస్థి, ఐశ్వర్యం పెరిగినా వెలితి..
ఆస్థి, ఐశ్వర్యం పెరిగినా మానవ జీవన గమనం ఒకింత వెలితిగానే సాగుతోంది. జీవన ప్రమాణ స్థాయి పెరిగి విలాస వస్తువులు ఇంటి నిండా ఉన్నా భారీ కొంపలో భా ర్యభర్తలే జీవిస్తున్నారు. మదినిండా సంతోషాన్ని పంచే వా రు దరిచేరక మనస్సు విప్పి మాట్లాడే తోడు మిగలక యాంత్రిక జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పరిశీలించి అభివృద్ధి చెందారని ఆనంద పడాలో... అభాగ్య జీవితాన్ని సాగిస్తున్నామని మదన పడాలో అర్థంకాని పరిస్థితి.