:: Welcome to NRI - Article ::

పాస్‌పోర్టుపై పుట్టిన తేదీని మార్చుకోవడమెలా...?

 పాస్‌పోర్టుపై మనం సమర్పించిన వివరాలకు బదులు పొరపాటుగా వేరేవి వస్తుంటాయి. చిరునామా, పేరు, తల్లిదండ్రుల పేర్లు వంటివి తప్పుగా వస్తుంటాయి. వీటితోపాటు పుట్టినతేదీ కూడా తప్పుగా వస్తుంటుంది. వీటిని మార్చుకోవడానికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్‌ రీ- ఇష్యూ సర్వీసును ఉపయోగించుకోవాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారానే సరియైున పుట్టిన తేదీని మార్చుకోవచ్చు. ఇంతకుముందు పాస్‌పోర్టుపై ఉన్న పుట్టిన తేదీని, ఒరిజినల్‌ పుట్టిన తేదీని పేర్కొంటూ, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జతచేసి ఈ మెయిల్‌గానీ, నేరుగాగానీ ఎంబసీ/ కాన్సులేట్‌ కార్యాలయానికి పంపించాలి. పుట్టిన తేదీని ధృవీకరించే విధంగా పత్రాలను జతచేయాలి. కొత్త పాస్‌పోర్టు పొందిన తర్వాత పాత దాన్ని ఎంబసీ/కాన్సులేట్‌లో సరెండర్‌ చేయాలి.