:: Welcome to NRI - Article ::

చిరు దాటాల్సిన రికార్డులివే..

మెగాస్టార్ చిరంజీవి. డాన్సులతో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన హీరో. దాదాపు తొమ్మిదేళ్లు సినిమాలకు విరామం ఇచ్చినా, వయసు ఆరు పదులు దాటినా సరే తనలో డైలాగ్ డెలివరీ, డాన్సుల్లో పదును తగ్గలేదని ఖైదీ నెంబర్ 150తో నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విడుదలయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కురిపిస్తోంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటే స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా ఓవర్సీస్‌లో లక్ష డాలర్లను కొల్లగొట్టిందని వార్తలు వస్తున్నాయి. సినిమాలకు దూరమయిన తర్వాత ఎందరో హీరోలో ఓవర్సీస్ కలెక్షన్లలో దూసుకెళ్లి రికార్డులు సృష్టించారు. ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డులను తిరగరాయాలంటే.. యంగ్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులను దాటాల్సిందే. మరి చిరు సినిమాకు టార్గెట్‌గా ఉన్న టాప్ సినిమాలేవో ఓ లుక్కేద్దామా..?
 
సినిమా కలెక్షన్లు
బాహుబలి 7.51 మిలియన్ డాలర్లు
శ్రీమంతుడు 2.89 మిలియన్ డాలర్లు
అ.. ఆ.. 2.45 మిలియన్ డాలర్లు
నాన్నకు ప్రేమతో 2.02 మిలియన్ డాలర్లు
అత్తారింటికి దారేది 1.90 మిలియన్ డాలర్లు
జనతాగ్యారేజ్ 1.80 మిలియన్ డాలర్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.64 మిలియన్ డాలర్లు
ఊపిరి 1.57 మిలియన్ డాలర్లు
దూకుడు 1.56 మిలియన్ డాలర్లు
మనం 1.54 మిలియన్ డాలర్లు

 

Loading...