Yatra-Movie-First-Show-Ticket-Cost-

‘యాత్ర’ మొదటి షో టికెట్‌ ధర రూ.4.37 లక్షలు

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల కాబోతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 
ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. వేలంలో ‘యాత్ర’ సినిమా మొదటి షో టికెట్‌ ధర 6,116 డాలర్లకు అమ్ముడైంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా.. రూ.4.37 లక్షలు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. ‘యాత్ర’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది.