worldwide-collections

తొలి రోజు స‌త్తా చాటిన `అర‌వింద స‌మేత‌`!

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `అర‌వింద సమేత‌`. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య గురువారం నాడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. దీంతో ఈ సినిమా రికార్డు క‌లెక్ష‌న్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తొలి రోజే ఈ సినిమా భారీ కలెక్ష‌న్లు సాధించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

 
నాన్‌-బాహుబ‌లి రికార్డుల‌ను ఈ సినిమా ఇప్పటికే బద్ధలుకొట్టినట్లు సినీవిశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజున `అర‌వింద స‌మేత‌` సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయ‌ల గ్రాస్ కొల్ల‌గొట్టింద‌ట‌. అమెరికాలో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరిపోయింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువారం ఒక్క‌రోజే దాదాపు 26 కోట్ల రూపాయ‌లు క‌లెక్ట్ చేసింద‌ట‌. అమెరికాతోపాటు ఆస్ట్రేలియాలోనూ `అర‌వింద స‌మేత‌` భారీ స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.