:: Welcome to NRI - Article ::

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్ వీడియో

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను బహిరంగంగా విమర్శించినా, వర్మను ముద్దుపెట్టుకుంటానని కామెంట్ చేసినా.. విజయ్‌ దేవరకొండకే చెల్లుతాయి. అందుకే ఇప్పుడు విజయ్ ఏం మాట్లాడతాడా అని నెటిజన్లు, మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రబృందం కూడా సంబరాలు చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఓవర్సీస్‌లో కూడా గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలయిన ఈ సినిమా.. అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బోల్డ్ డైలాగ్స్‌తో యువతను మెప్పించే లవ్‌స్టోరీని దర్శకుడు బాగా ప్రజెంట్ చేశాడని విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు.
 
అమెరికాలో నిర్వాణ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ.. ఈ సినిమాను విడుదల చేసింది. దాదాపు 85 స్క్రీన్లలో అర్జున్‌రెడ్డి సినిమా విడుదల అయింది. ఓవర్సీస్ సినీ ప్రియుల కోసం నిర్వాణ సంస్థ.. విజయ్ దేవరకొండతో కలిసి ప్రత్యేక వీడియో రూపొందించింది. ఆ వీడియోలో కూడా తనదైన శైలిలో మాట్లాడి ఓవర్సీస్ సినీ ప్రియులను విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. ‘యూఎస్‌ఏ.. కాలుతోందా మీకు.. ఇండియాలో అల్‌రెడీ ప్రీమియర్స్ అయిపోయాయి. మీకంటే ముందే సినిమా చూశాం. నిర్వాణ ఫిల్మ్స్ అమెరికాలో 85 చోట్ల సినిమాను విడుదల చేసింది..’ అని చెబుతూ ఇక్కడే ఉండి ఓవర్సీస్ ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు.